ప్రతిష్టాత్మక టెస్ట్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్

ప్రతిష్టాత్మక పింక్ బాల్ టెస్ట్ ప్రారంభం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, బంగ్లాదేశ్ పింక్ బాల్ టెస్ట్‌లో ఫస్ట్ బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ పూర్తిగా గులాబీ రంగులో దర్శనమిస్తోంది. స్టేడియంతోపాటూ కోల్‌కతా మొత్తాన్ని అభిమానులు పింక్ కలర్‌లో డెకరేట్ చేశారు.
ఇప్పటివరకూ ఇండియన్ క్రికెట్‌లో తెలుపు, ఎరుపు బంతులు మాత్రమే ఉండేవి. తొలిసారి పింక్ బంతిని వాడగా.. కొత్తగా వాడుకలోకి వచ్చిన ఈ పింక్ బాల్ మ్యాచ్‌లను పండగలా జరుపుకుంటున్నారు ప్లేయర్లు. టీమిండియా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో టెస్ట్ ఆడటం విశేషం. రెండు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే ఓ టెస్టును దక్కించుకున్న టీమిండియా రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
ఈ సిరీస్ కనుక టీమిండియా గెలిస్తే మాత్రం వరుసగా 12వ సిరీస్ గెలిచినట్లు అవుతుంది. అందువల్ల చరిత్రాత్మక టెస్ట్ మ్యూచ్‌ను చూసేందుకు అభిమానులతోపాటూ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నారు.