మరో నలుగురు ప్లేయర్లను ప్రకటించిన బీసీసీఐ
బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సోమవారం వరల్డ్ కప్‌కు ఆడే 15 మంది భారత ప్లేయర్ల జాబితా విడుదల చేసింది.

బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సోమవారం వరల్డ్ కప్‌కు ఆడే 15 మంది భారత ప్లేయర్ల జాబితా విడుదల చేసింది.
బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సోమవారం వరల్డ్ కప్‌కు ఆడే 15 మంది భారత ప్లేయర్ల జాబితా విడుదల చేసింది. దాంతో పాటు అదనంగా మరో నలుగురు ఫాస్ట్ బౌలర్లను టీమిండియాకు సహాయకులుగా ప్రకటించింది. నవదీప్ సైనీ, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్‌లను ఎంపిక చేసి ఇంగ్లాండ్‌కు పంపనుంది.
కోహ్లీ నేతృత్వంలో సాగనున్న 15మంది జట్టులో ఐదుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్, ఇద్దరు వికెట్ కీపర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు, ఇద్దరు మణికట్టు స్పిన్నర్లతో పాటు ఈ నలుగురు ప్లేయర్లు కూడా జట్టుతో కలిసి ప్రయాణించనున్నారు.
Read Also : లారెన్స్ దెయ్యం సినిమాల సీక్వెల్స్
నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్‌లు ఐపీఎల్ 2019సీజన్లో బిజీగా ఉండగా ఆవేశ్ ఖాన్ ఒక్కడే విశ్రాంతిలో ఉన్నాడు. రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు హ్యాండ్ ఇచ్చి దినేశ్ కార్తీక్‌కు జట్టులో చోటు కల్పించారు. ‘మహేంద్ర సింగ్ ధోనీ గాయం కారణంగా ఆడలేని సమయంలో మాత్రమే దినేశ్ కార్తీక్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అనుభవమున్న ప్లేయర్ కాబట్టే కార్తీక్‌ను ఆ స్థానంలోకి తీసుకున్నాం’ అని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.
మే 30నుంచి ఆరంభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భారత్ తొలి మ్యాచ్‌ను జూన్ 5న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఆ తర్వాత వరుసగా
జూన్ 9న ఆస్ట్రేలియాతో..
జూన్ 13న న్యూజిలాండ్‌తో..
జూన్ 16న పాకిస్తాన్‌తో..
జూన్ 22న అఫ్ఘనిస్తాన్‌తో..
జూన్ 27న వెస్టిండీస్‌తో..
జూన్ 30న ఇంగ్లాండ్‌తో..
జులై 02న బంగ్లాదేశ్‌తో..
జులై 06న శ్రీలంకతో..
Read Also : RRR మూవీపై రూమర్స్ : ప్రభాస్ గెస్ట్ రోల్