గజిబిజీలో బీసీసీఐ: పాక్‌తో మ్యాచ్ ఆడాలా.. వద్దా

గజిబిజీలో బీసీసీఐ: పాక్‌తో మ్యాచ్ ఆడాలా.. వద్దా

Updated On : February 22, 2019 / 1:52 PM IST

మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న వరల్డ్ కప్‌లో భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ ఆడాలా.. వద్దా అనే అంశంపై చర్చించేందుకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(సీఓఏ), బీసీసీఐ అధికార ప్రతినిధులు కలిసి న్యూ ఢిల్లీలో ఫిబ్రవరి 22 శుక్రవారం సమావేశమైయ్యారు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ జూన్ 16వ తేదీన జరగనుండటంతో సుదీర్ఘ సమయం ఉందని తామే స్వయంగా ఐసీసీతో చర్చలు జరుపుతామని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. 

పుల్వామా ఉగ్రదాడిలో జరిగిన దారుణం గురించి, 40 మంది జవాన్లపై జరిపిన ఆత్మాహుతి దాడి గురించి ఓ లేఖ ద్వారా ఐసీసీకి వివరిస్తామని  తెలిపాడు. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశాలను ఐసీసీ పరిధిలో ఉండకూడదనే విన్నపాన్ని తెలియజేస్తామన్నారు. 

మరో బీసీసీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఐసీసీ దీనికి మద్దతు తెలియజేయడం లేదు. పాకిస్తాన్‌ను వరల్డ్ కప్ నుంచి నిషేదించేందుకు ఐసీసీ నియమాలు అంగీకరిచడం లేదు. పైగా ఈ నిర్ణయానికి మెజార్టీ కూడా లభించడం లేదు. అందుకే దీనిపై మరోసారి చర్చ జరపాల్సిన అవసరం ఉంది’ అని వివరించారు.