Bowling Coach : టీమ్ఇండియా బౌలింగ్ కోచ్.. వినయ్‌కుమార్ వద్దే వద్దు..? రేసులో 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆటగాడు..!
బౌలింగ్ కోచ్‌గా వీరిద్దరిలో ఒకరు ఖాయం అని అంటున్నారు.

BCCI says to no Vinay Kumar Will pick Bowling Coach From These Former Stars Report
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం అయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు అతడు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఇక ఇప్పుడు అతడి సహాయక సిబ్బందిలో ఎవరెవరు ఉంటారనే అంశం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బ్యాటింగ్ కోచ్‌గా స్వయంగా గంభీరే బాధ్యతలు తీసుకుంటాడని వార్తలు వస్తుండగా.. బౌలింగ్ కోచ్‌గా వీరిద్దరిలో ఒకరు ఖాయం అని అంటున్నారు.
ఫీల్డింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన జాంటీ రోడ్స్, అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్‌గా వినయ్‌కుమార్ లను గంభీర్ ఎంచుకున్నట్లుగా కథనాలు వచ్చాయి. అయితే.. తాజాగా బౌలింగ్ కోచ్ పదవికి జహీర్ ఖాన్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను బీసీసీఐ పరిశీలిస్తోందని, వినయ్ కుమార్ పై బీసీసీఐ ఆసక్తి చూపడం లేదని ఏఎన్ఐ తెలిపింది.
Irfan – Yusuf : ఏంటి భయ్యా మీరు కూడానా..? ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్‌ల మధ్య గొడవ..! వీడియో..
2003 వన్డే ప్రపంచకప్‌లో సభ్యుడైన జహీర్ ఖాన్ అయితే బాగుంటుందని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు కాదంటే లక్ష్మీపతి బాలాజీ వైపు మొగ్గు చూపాలని అనుకుంటున్నారట. వినయ్‌కుమార్ విషయంలో మాత్రం ఖరాఖండిగా నో చెప్పారట.
భారత జట్టు తరుపున జహీర్ ఖాన్ 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 282, టీ20ల్లో 17 వికెట్లు తీశాడు. భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జహీర్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. గంగూలీ కెప్టెన్సీలో 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా తరుపున జహీర్ ఆడాడు.
లక్ష్మీపతి బాలాజీ విషయానికి వస్తే.. టీమ్ఇండియా తరుపున కేవలం 43 మ్యాచులు మాత్రమే ఆడాడు. 8 టెస్టుల్లో 27 వికెట్లు, 30వన్డేల్లో 34 వికెట్లు, 5 టీ20ల్లో 10 వికెట్లు తీశాడు.