Irfan – Yusuf : ఏంటి భ‌య్యా మీరు కూడానా..? ఇర్ఫాన్ ప‌ఠాన్‌, యూస‌ఫ్ ప‌ఠాన్‌ల మ‌ధ్య గొడ‌వ‌..! వీడియో..

టీమ్ఇండియా మాజీ ఆట‌గాళ్లు యూస‌ఫ్ ప‌ఠాన్, ఇర్ఫాన్ ప‌ఠాన్‌ లు అన్నాద‌మ్ములు అన్న సంగ‌తి తెలిసిందే.

Irfan – Yusuf : ఏంటి భ‌య్యా మీరు కూడానా..? ఇర్ఫాన్ ప‌ఠాన్‌, యూస‌ఫ్ ప‌ఠాన్‌ల మ‌ధ్య గొడ‌వ‌..! వీడియో..

Irfan Pathan yells at elder brother Yusuf Pathan after getting run out

Irfan Pathan – Yusuf Pathan : టీమ్ఇండియా మాజీ ఆట‌గాళ్లు యూస‌ఫ్ ప‌ఠాన్, ఇర్ఫాన్ ప‌ఠాన్‌ లు అన్నాద‌మ్ములు అన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు క‌లిసి టీమ్ఇండియా త‌రుపున మ్యాచులు ఆడారు. కొన్ని మ్యాచులను ఈ ఇద్ద‌రు అన్నాద‌మ్ముల్లే గెలిపించారు కూడా. మైదానంలోనే కాదు బ‌య‌ట కూడా కూడా వీరిద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. అన్నాద‌మ్ములు అంటే వీళ్ల‌లాగే ఉండాలి అనేంతగా ఉంటారు. అయితే.. తాజాగా వీరిద్ద‌రు మైదానంలో గొడ‌వ ప‌డ్డారు.

ఈ ఘ‌ట‌న వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ టోర్నీ సంద‌ర్భంగా చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇర్ఫాన్ త‌న అన్న యూస‌ప్ తో స‌మ‌న్వ‌య లోపం కార‌ణంగా ర‌నౌట్ అయ్యాడు. దీంతో యూస‌ఫ్ పై ఇర్ఫాన్ నోరు పారేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

బుధ‌వారం ద‌క్షిణాఫ్రికా ఛాంపియ‌న్స్‌, ఇండియా ఛాంపియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా ఛాంపియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో స్నైమ్యాన్‌ (73), రిచర్డ్‌ లెవి (60) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో హర్బజన్ సింగ్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఇండియా ఛాంపియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులే చేసి ఓట‌మి పాలైంది. అయితే.. మ్యాచ్ ఓడిపోయినా కూడా మెరుగైన ర‌న్‌రేటు కార‌ణంగా భార‌త్ సెమీ ఫైన‌ల్‌కు చేరుకుంది.

Also Read : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. మొన్న ప్ర‌పంచ‌క‌ప్‌.. ఇప్పుడేమో ఏకంగా..

కాగా.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా సెమీ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించాలంటే 12 బంతుల్లో 21 ప‌రుగులు చేయాల్సి ఉంది. ఆ స‌మ‌యానికి క్రీజులో ఇర్ఫాన్‌ పఠాన్‌ (34), యూసఫ్‌ పఠాన్‌ (36) లు ఉన్నారు. 19 ఓవ‌ర్ తొలి బంతికి స్టెయిన్ బౌలింగ్‌లో ఇర్ఫాన్ ప‌ఠాన్ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించాడు. అయితే.. బంతి స‌రిగ్గా క‌నెక్ట్ కాక‌పోవ‌డంతో గాల్లోకి లేచింది. స‌ఫారీ ఫీల్డ‌ర్లు క్యాచ్‌ను నేల‌పాలు చేశారు.

Also Read: Chris Gayle : 44 ఏళ్ల వ‌య‌సులోనూ క్రిస్‌గేల్ వీర‌విహారం.. ద‌క్షిణాఫ్రికాపై వెస్టిండీస్ విజ‌యం..

అదే స‌మ‌యంలో అప్ప‌టికే ఒక్క ప‌రును పూర్తి చేశారు ప‌ఠాన్ బ్ర‌ద‌ర్స్‌. రెండో ప‌రుగు కోసం ఇర్ఫాన్ ప్ర‌య‌త్నించాడు. అయితే.. దీన్ని యూస‌ఫ్ తిర‌స్క‌రించాడు. అప్ప‌టికే ఇర్ఫాన్ పిచ్ పై స‌గం ప‌రిగెత్తాడు. మ‌ళ్లీ వెన‌క్కి ప‌రిగెత్తి క్రీజును చేరే లోపు ఫీల్డ‌ర్ నుంచి బంతి అందుకున్న స్టెయిన్ వికెట్ల‌ను ప‌డ‌గొట్ట‌డంతో ఇర్ఫాన్ ర‌నౌట్ అయ్యాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ఇర్ఫాన్.. త‌న అన్న యూస‌ఫ్ పై గ‌ట్టిగా అరిచాడు. రెండో ప‌రుగు ఈజీగా వ‌చ్చేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.

కాగా.. ఈమ్యాచ్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికి టీమ్ఇండియా ఛాంపియ‌న్స్ సెమీ ఫైన‌ల్ కు చేరుకోవ‌డంతో మ్యాచ్ అనంత‌రం ఇర్ఫాన్ త‌న అన్న యూస‌ఫ్ నుదిటిపై ముద్దు పెట్టి సంబ‌రాలు చేసుకున్నాడు.