IPL 2025: ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పు.. బీసీసీఐ కీలక నిర్ణయం.. కారణం ఏంటంటే..
సవరించిన IPL 2025 షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ పోరు జరగనుంది.

IPL 2025: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరిగే వేదిక మారింది. ఫైనల్ మ్యాచ్ ని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 3న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో పైనల్ జరగాల్సి ఉంది. అయితే, వేదికను మార్చారు. దీనికి కారణం జూన్ 3న కోల్ కతాలో వర్షం పడే అవకాశం ఉండటమే.
జూన్ 3న జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు బదులుగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు బీసీసీఐ వేదికను ఖరారు చేసింది. మే 25న ప్రారంభ షెడ్యూల్ ప్రకారం ఈడెన్ గార్డెన్స్ ఐపీఎల్ 2025 ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా టోర్నమెంట్ ఒక వారం పాటు నిలిపివేయబడింది. సవరించిన IPL 2025 షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ పోరు జరగనుంది. కాగా, జూన్ 1న జరిగే క్వాలిఫయర్ 2కు కూడా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
మంగళవారం జరిగిన BCCI సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ మొదటి రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. IPL 2025 ఫైనల్‌ను కోల్‌కతా నుండి మార్చడానికి ప్రధాన కారణం జూన్ 3న వర్షాభావ సూచనే. రివైజ్డ్ ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం.. లీగ్ దశ మే 27వ తేదీతో ముగుస్తుంది. మే 29న క్వాలిఫయర్ 1, 30వ తేదీన ఎలిమినేటర్ మ్యాచ్ లు జరుగుతాయి. జూన్ 1న క్వాలిఫయర్ 2 జరుగుతుంది.