Ben Stokes : ఎంఎస్ ధోని ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన స్టోక్స్‌

యాషెస్ సిరీస్‌(Ashes)లో వ‌రుస‌గా మొద‌టి రెండు మ్యాచుల్లో ఓడిన ఇంగ్లాండ్ జ‌ట్టు ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టింది. ఇంగ్లాండ్ జ‌ట్టు గెలుపొందడం ద్వారా భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ఓ రికార్డును బెన్‌స్టోక్స్ బ‌ద్ద‌లు కొట్టాడు.

Ben Stokes : ఎంఎస్ ధోని ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన స్టోక్స్‌

MS Dhoni-Ben Stokes

Ben Stokes-MS Dhoni : యాషెస్ సిరీస్‌(Ashes)లో వ‌రుస‌గా మొద‌టి రెండు మ్యాచుల్లో ఓడిన ఇంగ్లాండ్ జ‌ట్టు ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టింది. లీడ్స్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టులో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌న‌తో ఆక‌ట్టుకుంది. 251 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సిరీస్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకుంది. ఇంగ్లాండ్ విజ‌యంలో ఆ జ‌ట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్‌(Ben Stokes)తో పాటు హ్యారీ బ్రూక్(Harry Brook) కీల‌క పాత్ర పోషించారు. మొద‌టి ఇన్నింగ్స్‌లో స్టోక్స్ (80) రెండో ఇన్నింగ్స్‌లో బ్రూక్ (75) లు రాణించారు.

ఇంగ్లాండ్ జ‌ట్టు గెలుపొందడం ద్వారా భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ఓ రికార్డును బెన్‌స్టోక్స్ బ‌ద్ద‌లు కొట్టాడు. టెస్టుల్లో 250కి పైగా ప‌రుగుల ల‌క్ష్యాన్ని అత్య‌ధిక సార్లు ఛేదించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు మ‌హేంద్రుడి పేరిట ఉండేది. ధోని నాయ‌క‌త్వంలో టీమ్ఇండియా టెస్టుల్లో నాలుగు సార్లు 250కి పైగా ప‌రుగుల ల‌క్ష్యాన్ని విజ‌య‌వంతంగా ఛేదించింది.

Sunil Gavaskar : రోహిత్ కెప్టెన్సీ నిరాశప‌రిచింది.. ఆట‌గాళ్ల మ‌ధ్య గ్యాప్ పెర‌గ‌డానికి అది ఓ కార‌ణం

ఆస్ట్రేలియాపై విజ‌యం సాధించ‌డం ద్వారా ధోని రికార్డును బెన్‌స్టోక్స్ బ్రేక్ చేశాడు. స్టోక్స్ సార‌థ్యంలో ఇంగ్లాండ్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు 5 సార్లు 250కి పైగా ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది. ఇక ఈ జాబితాలో విండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా, ఆస్ట్రేలియా మాజీ సార‌థి రికీ పాంటింగ్‌లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

టెస్టుల్లో 250+ పరుగుల ఛేజింగ్‌లతో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు :

5 – బెన్‌స్టోక్స్‌
4 – ఎంఎస్ ధోని
3 – బ్రియాన్ లారీ, రికీ పాంటింగ్‌

Ashes 2023 : బ‌జ్‌బాల్ దెబ్బ‌.. ఆసీస్ అబ్బా.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజ‌యం.. సిరీస్ ఆశ‌లు స‌జీవం