ODI World Cup 2023 : కోహ్లీ డకౌట్ పై ఇంగ్లాండ్ ఓవరాక్షన్.. దిమ్మతిరిగే షాకిచ్చిన ది భారత్ ఆర్మీ!

భారత్ వేదికగా జరుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా విజయపరంపర కొన‌సాగుతోంది. ల‌క్నో వేదిక‌గా ఆదివారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 100 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

ODI World Cup 2023 : కోహ్లీ డకౌట్ పై ఇంగ్లాండ్ ఓవరాక్షన్.. దిమ్మతిరిగే షాకిచ్చిన ది భారత్ ఆర్మీ!

The Bharat Army

Updated On : October 30, 2023 / 3:23 PM IST

ODI World Cup 2023 IND vs ENG : భారత్ వేదికగా జరుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా విజయపరంపర కొన‌సాగుతోంది. ల‌క్నో వేదిక‌గా ఆదివారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 100 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. నెంబర్ త్రీగా బరిలోకి దిగిన విరాట్ తొమ్మిది బంతులు ఆడి డేవిడ్ విల్లే బౌలింగ్ లో బెన్ స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.

ODI World Cup 2023 : భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ విరామ సమయంలో రైనా, కోహ్లీ ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్

విరాట్ కోహ్లీ డకౌట్ కావడంతో ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ (ఇంగ్లండ్ మద్దతుదారుల క్లబ్) ఓవరాక్షన్ చేసింది. నీటిలోని బాతు ఫొటోను తీసుకొని దానిని మార్ఫింగ్ చేసి దాని మెడ భాగంలో విరాట్ కోహ్లీ తలను తగిలించి ట్వీట్ చేసింది. కోహ్లీ డకౌట్ అయ్యాడని హేళన చేస్తూ ఇలా ఫొటోలో ఇంగ్లాండ్ బార్మీఆర్మీ ట్వీట్ చేసింది. బార్మీ ఆర్మీ అతిప్రవర్తనకు భారత్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 230 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ప్లేయర్స్ భారత్ బౌలర్ల బౌలింగ్ దాటికి క్రీజులో కుదురుకోలేక పోయారు. ఈ క్రమంలో జో రూట్, బెన్ స్టోక్స్ డకౌట్ అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ ట్వీట్ కు ‘టీమ్ ఇండియా ది భారత్ ఆర్మీ’ జో రూ్, బెన్ స్టోక్స్ తలను నీటిలోని బాతు తల వద్ద ఉంచిన చిత్రాలను ట్విటర్ లో పోస్టు చేసింది.