SA vs AUS : అరుదైన జాబితాలో చోటు ద‌క్కించుకున్న ఆసీస్ కెప్టెన్ క‌మిన్స్‌.. లార్డ్స్‌లో గ‌త 50 ఏళ్ల‌లో ఒకే ఒక్క‌డు..

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అరుదైన జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు.

SA vs AUS : అరుదైన జాబితాలో చోటు ద‌క్కించుకున్న ఆసీస్ కెప్టెన్ క‌మిన్స్‌.. లార్డ్స్‌లో గ‌త 50 ఏళ్ల‌లో ఒకే ఒక్క‌డు..

Big achievement for Cummins Australia captain dismissing opposition captain in Tests at Lord’

Updated On : June 12, 2025 / 5:20 PM IST

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అరుదైన జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు. లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన టెస్టు మ్యాచ్‌ల్లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు కెప్టెన్‌ను ఔట్ చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ల జాబితాలో స్థానం సంపాదించాడు.

ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-25 ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బ‌వుమాను ఔట్ చేయ‌డం ద్వారా కమిన్స్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఇయాన్ చాపెల్‌, మాంటీ నోబుల్‌లు మాత్ర‌మే క‌మిన్స్ క‌న్నా ముందు ఈ ఘ‌న‌త సాధించారు.

Gautam Gambhir : ‘ఇంత కంటే మంచి స‌మ‌యం మ‌రొక‌టి ఉండ‌దు..’ రోహిత్, కోహ్లీ, అశ్విన్ టెస్టు రిటైర్‌మెంట్ల‌పై గంభీర్ కామెంట్స్‌..

లార్డ్స్‌లో జరిగిన టెస్ట్‌లలో ప్రత్యర్థి కెప్టెన్‌ను ఔట్ చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్లు వీరే..

* మాంటీ నోబుల్ – 1909లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆర్చీ మాక్‌లారెన్ ను
* ఇయాన్ చాపెన్ – 1975లో టోనీ గ్రెగ్ ను
* పాట్ క‌మిన్స్ – 2025లో టెంబా బ‌వుమాను

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ‌వుమా  84 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 36 ప‌రుగులు చేశాడు. పాట్ క‌మిన్స్ బౌలింగ్‌లో మార్న‌స్ లబుషేన్ చక్క‌టి క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

WTC Final 2025 : టెస్టుల్లో బుమ్రా రికార్డును బ్రేక్ చేసిన రబాడ‌.. ఆసీస్ పై ఒకే ఒక్క‌డు..

రెండో రోజు లంచ్ విరామానికి తొలి ఇన్నింగ్స్‌లో ద‌క్షిణాఫ్రికా 121/5 స్కోరుతో నిలిచింది. కైల్ వెర్రెయిన్ (11), డేవిడ్ బెడింగ్‌హామ్ (39)లు క్రీజులో ఉన్నారు. ద‌క్షిణాప్రికా ఇంకా 91 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 212 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.