Asia Cup In Sri Lanka: ఈ సమయంలో ఏమీ చెప్పలేం: గంగూలీ
శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు టీ20 ఆసియా కప్ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే, ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రస్తుతం శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకలో ఈ టోర్నమెంటు జరుగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.

Sourav Ganguly
Asia Cup In Sri Lanka: శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు టీ20 ఆసియా కప్ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే, ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రస్తుతం శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకలో ఈ టోర్నమెంటు జరుగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ఒకవేళ శ్రీలంకలో ఆసియా కప్ జరగని పరిస్థితి ఉంటే భారత్‌లో నిర్వహిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
Maharashtra: పెట్రోల్‌పై లీటరుకు రూ.5 వ్యాట్ తగ్గించిన మహారాష్ట్ర కొత్త సీఎం షిండే
శ్రీలంకలోని పరిస్థితులను పరిశీలిస్తున్నామని చెప్పారు. శ్రీలంకలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇటీవల ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఆడిందని తెలిపారు. శ్రీలంకలో ఆసియా కప్ నిర్వహణపై మరో నెల రోజులు వేచి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, కరోనా సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వేళ కూడా క్రికెట్ మ్యాచులు కొనసాగాయని ఆయన అన్నారు. అలాగే, క్రికెట్ మ్యాచుల ప్రసార హక్కులు భారీ ధరలు అమ్ముడుపోతున్నాయని వివరించారు.