IND vs AUS: భార‌త్‌తో మూడో టెస్టు.. హెడ్‌ను వ‌దిలేసి స్మిత్‌ను ప‌ట్టుకున్న రోహిత్.. వీడియో వైర‌ల్‌

రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగిపోయారు. ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలు చేశారు.

IND vs AUS: భార‌త్‌తో మూడో టెస్టు.. హెడ్‌ను వ‌దిలేసి స్మిత్‌ను ప‌ట్టుకున్న రోహిత్.. వీడియో వైర‌ల్‌

Rohit Sharma

Updated On : December 15, 2024 / 1:02 PM IST

Rohit Sharma: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగిపోయారు. ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలు చేశారు. అయితే, రోహిత్ శర్మ ట్రావిస్ హెడ్ క్యాచ్ వదిలేయగా.. స్టీవ్ స్మిత్ క్యాచ్ ను డ్రైవ్ చేసి అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: IND vs AUS : అట్లుంటది సిరాజ్‌తో పెట్టుకుంటే.. లబుషేన్, సిరాజ్ మధ్య ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్

రెండో రోజు ఆటలో టీ విరామం అనంతరం హెడ్ ను ఔట్ చేసే అవకాశం వచ్చింది. నితీశ్ రెడ్డి వేసిన బంతిని హెడ్ షాట్ కు ప్రయత్నించగా.. అది బ్యాట్ అంచునుతాకి స్లిప్ లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ ఆ క్యాచ్ ను అందుకోవటంలో విఫలం అయ్యాడు. బాల్ ను అందుకునేందుకు రోహిత్ డ్రైవ్ చేసినప్పటికీ ఇంకాస్త ప్రయత్నం చేసిఉంటే హెడ్ అవుట్ అయ్యి ఉండేవాడని నెటిజన్లు రోహిత్ ఫీల్డింగ్ పై నెట్టింట్లో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, హెడ్ క్యాచ్ వదిలేసిన కొద్దిసేపటికే రోహిత్ స్లిప్ లో స్టీవ్ స్మిత్ కొట్టిన బాల్ ను అందుకొని పెవిలియన్ కు పంపించాడు.

Also Read: IND vs AUS: నితీశ్ రెడ్డి సూపర్ బౌలింగ్.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా.. వీడియో వైరల్

జస్ర్పీత్ బుమ్రా బౌలింగ్ లో స్లిప్ లో రోహిత్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. బుమ్రా వేసిన బంతిని స్మిత్ షాట్ కొట్టే ప్రయత్నంలో బాల్ బ్యాట్ ఎడ్జ్ కు తగిలి స్లిప్ లోకి వెళ్లింది. స్లిప్ లో ఫీల్డింగ్ లో ఉన్న రోహిత్ శర్మ ఆ బాల్ ను డ్రైవ్ చేసి అందుకున్నాడు. దీంతో స్మిత్ నిరాశగా పెవిలియన్ కు వెళ్లిపోయాడు. దీంతో హెడ్ ఇచ్చిన క్యాచ్ ను వదిలేయడంతో నెటిజర్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న రోహిత్.. కొద్దిసేపటికే స్మిత్ ను అవుట్ చేసి నెటిజన్ల నుంచి ప్రశంసలు పొందాడు.