IND vs SA T20 Match : టీ20 మ్యాచ్ కు ముందు ఇండియా, సౌతాఫ్రికా కెప్టెన్ల ఫొటోషూట్ చూశారా? వీడియో వైరల్
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇవాళ సాయత్రం ఇరుజట్ల మధ్య డర్బన్ లోని కింగ్స్ మీడ్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది.

Suryakumar Yadav And Aiden Markram
IND vs SA T20 Series : భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇవాళ సాయత్రం ఇరుజట్ల మధ్య డర్బన్ లోని కింగ్స్ మీడ్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ ముందు సౌతాఫ్రికా కెప్టెన్ మార్ క్రమ్, భారత్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లు ఫొటో షూట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్ లో సూర్యకుమార్ నాయకత్వంలో టీమిండియా విజయం సాధించింది. దక్షిణాఫ్రికాలో ఆడే టీ20 జట్టుకు సూర్యకుమార్ నాయకత్వం వహిస్తున్నాడు. సౌతాఫ్రికాలోనూ భారత్ జట్టు ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలతో ఉంది. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో శుభ్ మన్ గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
Smiles ☺️
Cheers ?
Banter ?How about that for a #SAvIND T20I series Trophy Unveiling! ? ?#TeamIndia | @surya_14kumar pic.twitter.com/fxlVjIgT3U
— BCCI (@BCCI) December 10, 2023
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇవాళ తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఈనెల 12న రెండో టీ20 మ్యాచ్ (సెయింట్ జార్జ్ పార్క్, గ్కెబెర్హాలో), 14న మూడో టీ20 మ్యాచ్ (జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో) జరగనుంది.
వన్డే మ్యాచ్ లు.. తొలి వన్డే డిసెంబర్ 17న ( జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో), రెండో వన్డే డిసెంబర్ 19న (సెయింట్ జార్జ్ పార్క్, గ్కెబెర్హాలో), మూడో వన్డే డిసెంబర్ 21న (బోలాండ్ పార్క్ లో) జరుగుతుంది.
టెస్ట్ మ్యాచ్ లు .. డిసెంబర్ 26 – 30 వరకు తొలి టెస్ట్ మ్యాచ్ (సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో) జరుగుతుంది. జనవరి 3 – 7 వరకు రెండో టెస్ట్ (న్యూలాండ్స్, కేప్ టౌన్‌లో) జరుగుతుంది.
A fun shoot for the two Captains with a local flavour ??
Captain @surya_14kumar and Aiden Markram pose with the silverware ahead of the three match T20I series.#SAvIND pic.twitter.com/CsN3gMkilU
— BCCI (@BCCI) December 9, 2023