IND vs NZ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. అది మాకు ముఖ్యం కాదన్న రోహిత్ శర్మ..
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

PIC Credit @ bcci
దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని భారత్ భావిస్తోంది. అప్పుడెప్పుడో 2000వ సంవత్సరంలో భారత్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన న్యూజిలాండ్ మరోసారి కూడా టీమ్ఇండియాను ఓడించి రెండోసారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని ఆరాటపడుతోంది.
ఈ క్రమంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. సెమీస్‌లో గాయపడిన మాట్ హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్ వచ్చాడు. అటు భారత తుది జట్టులో ఎలాంటి మార్పు లేదు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలం అన్న అంచనాల నేపథ్యంలో నలుగురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగింది.
Virat Kohli : న్యూజిలాండ్‌తో ఫైనల్‌కు ముందు కోహ్లిని ఊరిస్తున్న పలు రికార్డులు ఇవే..
‘మేము మొదట బ్యాటింగ్ చేస్తాము. పిచ్ చాలా బాగుంది. గత వారం గ్రూప్ స్టేజీలో భారత్‌తో ఆడిన పిచ్ లాగానే స్పందింస్తుందని అనుకుంటున్నాను. మేము భారీ స్కోరును చేయాలని అనుకుంటున్నాము. తరువాత ఏమీ జరుగుతోందో చూడాలి. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ కాస్త స్లో అవుతుందని అనుకుంటున్నాము. మెరుపు ఆరంభాన్ని అందించాలని కోరుకుంటున్నాను. మాట్ హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్ జట్టులోకి వచ్చాడు. ‘అని మిచెల్ శాంట్నర్ అన్నాడు.
🚨 Toss News 🚨
New Zealand have elected to bat against #TeamIndia in the #ChampionsTrophy #Final!
Updates ▶️ https://t.co/uCIvPtzs19#INDvNZ pic.twitter.com/pOpMWIZhpj
— BCCI (@BCCI) March 9, 2025
‘తొలుత బ్యాటింగ్ చేస్తున్నామా, బౌలింగ్ చేస్తున్నామా అన్నది సమస్య కాదు. రెండో ఇన్నింగ్స్ సమయంలో పిచ్‌లో పెద్దగా మార్పు ఉండదని అనుకుంటున్నాను. మేము లక్ష్యాన్ని ఛేదించి కూడా మ్యాచ్‌లను గెలిచాము. ఇది చాలా కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. రోజు చివరికి వచ్చే సరికి మేము ఎలా ఆడాము అన్నదే ముఖ్యం. టాస్ గురించి ఆలోచించవద్దని, ఆటపై దృష్టి సారించాలని డ్రెస్సింగ్ రూమ్‌లోనే అనుకున్నాము. న్యూజిలాండ్ చాలా మంచి జట్టు. ఐసీసీ టోర్నీల్లో చాలా చక్కటి ప్రదర్శలను ఇవ్వడాన్ని చూస్తూనే ఉన్నాం. వారితో ఫైనల్ మ్యాచ్ ఆడడం నిజంగా మాకు ఓ ఛాలెంజ్.’ అని రోహిత్ శర్మ అన్నాడు.
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్ తుది జట్టు..
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జేమిసన్, విలియం ఓరూర్కే.