IPL 2020, RCB vs CSK: 37పరుగుల తేడాతో చెన్నైపై బెంగళూరు విజయం

  • Published By: vamsi ,Published On : October 10, 2020 / 07:13 PM IST
IPL 2020, RCB vs CSK: 37పరుగుల తేడాతో చెన్నైపై బెంగళూరు విజయం

Updated On : October 10, 2020 / 11:22 PM IST

[svt-event date=”10/10/2020,11:15PM” class=”svt-cd-green” ] ఐపిఎల్ 2020లో 25వ మ్యాచ్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌కు మధ్య జరగగా.. మొదట ఆడిన చెన్నై సూపర్ కింగ్స్‌పై బెంగళూరు 37పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 132పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. దీంతో 37పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. [/svt-event]

[svt-event title=”9ఓవర్లకు చెన్నై స్కోరు 44/2″ date=”10/10/2020,10:07PM” class=”svt-cd-green” ] రెండు వికెట్లు పడిన తర్వాత మూడవ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు చెన్నై ప్లేయర్లు. రాయుడు (7), జగదీశన్‌ (5) మరో వికెట్ పడకుండా ఆడుతుండగా,, స్కోరు మాత్రం నెమ్మదిగా సాగుతుంది. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 2వికెట్ల నష్టానికి 44పరుగులుగా ఉంది. [/svt-event]

[svt-event title=”రెండు వికెట్లు అవుట్.. చెన్నై స్కోరు 25/2″ date=”10/10/2020,10:01PM” class=”svt-cd-green” ] 170పరుగుల టార్గె‌ట్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ పరుగులు తీయడానికి కష్టపడుతూ ఉంది. పెద్దగా పరుగులు ఏమీ చెయ్యకుండానే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. 25పరుగులకే వాట్సన్, డూప్లెసిస్ అవుట్ అయ్యారు. 10బంతుల్లో 8పరుగులు మాత్రమే చేసి డుప్లెసిస్ 19పరుగుల వద్ద అవుట్ అవగా.. 25పరుగులు వద్ద 18బంతుల్లో 14పరుగులు చేసి వాట్సన్ అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”బెంగళూరు స్కోరు 169/4″ date=”10/10/2020,9:24PM” class=”svt-cd-green” ] 52బంతుల్లో 90పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. 90 పరుగుల స్కోరు కారణంగా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది బెంగళూరు. దీంతో చెన్నై విజయ లక్ష్యం 170 పరుగులు అయ్యింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన తరువాత, ఆర్‌సిబి జట్టు కేవలం 13 పరుగుల స్కోరుపై ఫస్ట్ వికెట్ కోల్పోయింది, ఆరోన్ ఫించ్ 9 బంతుల్లో 2 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీని తరువాత కెప్టెన్ విరాట్ కోహ్లీ, దేవదత్ పాడికల్ 50-ప్లస్ భాగస్వామ్యం ఇవ్వగా.. పాడికల్ 34 బంతుల్లో 33 పరుగులు చేసి అవుటయ్యాడు. వెంటనే డకౌట్‌గా డివిలియర్స్ పెవిలియన్ చేరుకున్నాడు. నాల్గవ వికెట్‌గా వాషింగ్టన్ సుందర్ 10బంతుల్లో 10పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత దిగిన శివం దుబే 14బంతుల్లో 22 పరుగులు చేశాడు. [/svt-event]

[svt-event title=”కోహ్లీ మెరుపులు.. చెన్నై టార్గెట్ 170″ date=”10/10/2020,9:13PM” class=”svt-cd-green” ] చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ మెరుపులు మెరిపించగా బెంగళూరు జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. నిర్ణీత 20ఓవర్లలో 169పరుగులు చేసి చెన్నైకి 170పరుగుల టార్గెట్ నిర్దేశించింది. [/svt-event]

[svt-event title=”మూడు వికెట్లు కోల్పోయిన బెంగళూరు.. స్కోరు 67/3″ date=”10/10/2020,8:21PM” class=”svt-cd-green” ] ఫస్ట్ వికెట్ పడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ, పాడిక్కల్ జాగ్రత్తగా ఆడుతూ బెంగళూరు జట్టు స్కోరును నడిపిస్తూ ఉండగా.. వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. పాడిక్కల్, డివిలియర్స్ అవుట్ అయ్యారు. [/svt-event]

[svt-event title=”10ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 65పరుగులు” date=”10/10/2020,8:21PM” class=”svt-cd-green” ] టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న బెంగళూరు జట్టు 10ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 65పరుగులు చేసింది. [/svt-event]

[svt-event title=”13పరుగులకే ఫస్ట్ వికెట్” date=”10/10/2020,8:19PM” class=”svt-cd-green” ] మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు కేవలం 13 పరుగుల స్కోరుకే మొదటి వికెట్ కోల్పోయింది. ఆరోన్ ఫించ్ 9 బంతుల్లో 2 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event date=”10/10/2020,8:19PM” class=”svt-cd-green” ] ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్‌లో 25 వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య దుబాయ్ మైదానంలో జరుగుతోంది. [/svt-event]

[svt-event title=”Royal Challengers Bangalore (Playing XI):” date=”10/10/2020,7:31PM” class=”svt-cd-green” ] దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (C), ఎబి డివిలియర్స్ (w), గుర్కీరత్ సింగ్ మన్, శివం దుబే, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, ఇసురు ఉడనా, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్ [/svt-event]

[svt-event title=”Chennai Super Kings (Playing XI): ” date=”10/10/2020,7:31PM” class=”svt-cd-green” ] షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (w/c), ఎన్ జగదీసన్, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, కరణ్ శర్మ [/svt-event]

[svt-event title=”ఇరు జట్లలో 11మంది ప్లేయర్లు వీళ్లే” date=”10/10/2020,7:11PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచిన బెంగళూరు.. చెన్నై బౌలింగ్!” date=”10/10/2020,7:00PM” class=”svt-cd-green” ] రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు x చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. [/svt-event]