పాండ్యాది సహజమైన టాలెంట్

న్యూజిలాండ్‌తో తొలి వన్డే నుంచి అందుబాటులో ఉండాల్సిన హార్దిక్ పాండ్యా కాఫీ విత్ కరణ్ షో ద్వారా జట్టులోకి ఆలస్యంగా చేరాడు. మూడో వన్డేకు ముందు వివాదాలన్నీ క్లియర్ అవడంతో మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్న పాండ్యా చివరి వన్డేలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగి 22 బంతుల్లో 45పరుగులు చేసి జట్టుకు కీలకమైన సమయంలో చక్కటి స్కోరు అందించగలిగాడు. ఫలితంగా భారత్.. కివీస్‌కు 253 పరుగుల టార్గెట్‌ను ఇవ్వగలిగింది.
ఈ ప్రదర్శన పట్ల టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. ‘హార్దిక్ పాండ్యా సహజ ప్రతిభావంతుడు. జట్టులో పాండ్య పునరాగమనం చాలా బాగుంది. మ్యాచ్ విన్నర్. బ్యాట్‌తో అతడేం చేయగలడో ఐదో వన్డేలో చేసి చూపించాడు. అతడు చేసిన పరుగులు ఎంతో కీలకమయ్యాయి’ అని కొనియాడాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన పేసర్ మహ్మద్ షమిని శాస్త్రి అభినందించాడు.
ఐదో వన్డేలో 18/4తో కష్టాల్లో పడ్డ టీమిండియాను రాయుడు, విజయ్ శంకర్, పాండ్య, జాదవ్ గట్టెక్కించారని ఆయన వెల్లడించాడు. కోచ్‌తో పాటు సెహ్వాగ్, కోహ్లీ వంటి పలువురు క్రీడా దిగ్గజాలు ఈ విజయానికి తమ అభినందనలు తెలుపుతూ ట్వీట్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.