Mirabai Chanu : కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చానుకి గోల్డ్ మెడల్

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ కు తొలి గోల్డ్ మెడల్ దక్కింది. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను బంగారు పతకం గెలుచుకుంది.

Mirabai Chanu : కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చానుకి గోల్డ్ మెడల్

Mirabai Chanu

Updated On : July 30, 2022 / 11:03 PM IST

Mirabai Chanu : బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ కు తొలి గోల్డ్ మెడల్ దక్కింది. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను బంగారు పతకం గెలుచుకుంది. మహిళల 49 కేజీల విభాగంలో 3 అటెంప్ట్స్ లో 197 కేజీల బరువు ఎత్తి సత్తా చాటింది. కామన్ వెల్త్ గేమ్స్ 2022లో భారత్ కు తొలి గోల్డ్ మెడల్ ఇదే.

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం

ఇప్పటివరకు ఒక రజతం, ఒక కాంస్యం వచ్చాయి. టోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచి మన దేశం గర్వించేలా చేసిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఈసారి గోల్డ్ కొట్టింది. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది.