Shama Mohamed- Rohit Sharma : ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. చెత్త కెప్టెన్..’ హిట్‌మ్యాన్‌పై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు..
కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Congress leader Shama Mohamed defends body shaming tweet on Rohit Sharma
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ అద్భుతంగా ఆడుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. మంగళవారం ఆస్ట్రేలియా జట్టుతో సెమీస్‌లో తలపడనుంది. ఈ క్రమంలో సెమీస్ చేరిన భారత జట్టుపై, రోహిత్ శర్మ నాయకత్వం పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటర్‌గా విఫలం అయ్యాడు. 17 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడని అన్నారు. అంతేకాకుండా చెత్త కెప్టెన్ అని విమర్శించారు. ఏదో అదృష్టం కొద్ది కెప్టెన్ అయ్యాడని, అసలు అతడు కెప్టెన్‌గా పనికి రాడని, ఓ సాధారణ ఆటగాడు మాత్రమేనని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు షామా పై తీవ్రంగా మండిపడుతున్నారు. తాను చేసిన ట్వీట్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతుండడంతో తాను చేసిన ట్వీట్‌ను తొలగించారు షామా.
IND vs AUS : హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్.. 2003, 2023 ఫైనల్స్‌కి రివేంజ్ తీర్చుకుంటారా?
ఈ క్రమంలో నెటిజన్లు రోహిత్ శర్మ ఫిట్‌నెస్, కెప్టెన్సీ మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో మరికొంత మంది మాత్రం రోహిత్ ఫిట్‌నెస్ పై ప్రశ్నలు లెవనెత్తున్నారు. ఏదీ ఏమైనప్పటికి టీమ్ఇండియా విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకడు అనేది కాదనలేని సత్యం. అతడి నాయకత్వంలో భారత జట్టు 2024 టీ20 ప్రపంచకప్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక బ్యాటర్‌గా రోహిత్ శర్మ ఎంతటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
షామా వ్యాఖ్యపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బిజెపి అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని ఆశిస్తున్నదా అని ఎద్దేశా చేశారు. ‘కాంగ్రెస్‌కు ఇది సిగ్గుచేటు ఇప్పుడు వారు భారత క్రికెట్ కెప్టెన్‌ను వదలడం లేదు. రాజకీయాల్లో విఫలమైన తర్వాత వారి నేత రాహుల్ గాంధీ ఇప్పుడు క్రికెట్ ఆడాలని వారు కోరుకుంటున్నారేమో.’ అని విమర్శించారు.
స్పందించిన షామా..
తాను చేసిన పోస్ట్ తీవ్ర దుమారం రేపడంతో షామా మరోసారి స్పందించింది. ధోని, కోహ్లీ, కపిల్ దేవ్ వంటి కెప్టెన్లతో రోహిత్ ను పోలుస్తూ తాను సాధారణంగానే ఈ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు.
షామా చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.