IND vs AUS : హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్.. 2003, 2023 ఫైనల్స్‌కి రివేంజ్ తీర్చుకుంటారా?
ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో ఎన్ని సందర్భాల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ముఖాముఖిగా తలపడ్డాయంటే..

Champions Trophy 2025 IND vs AUS Semifinal Head to Head Records
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆఖరి అంకానికి తెరలేచింది. గ్రూప్ స్టేజీలో మ్యాచ్‌లు ముగిశాయి. మంగళ, బుధ వారాల్లో సెమీస్ మ్యాచ్‌లు జరగనుండగా ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తొలి సెమీస్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ క్రమంలో 2023, 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో ఎన్ని సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. పై చేయి ఎవరిది అన్న సంగతిని ఓ సారి పరిశీలిద్దాం..
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లలో భారత్, ఆస్ట్రేలియా జట్ల రికార్డులు ఇవే..
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లలో భారత్, ఆస్ట్రేలియా జట్లు 14 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలవగా భారత్ 5 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక టీ20 ప్రపంచకప్‌లలో ఇరు జట్లు ఆరు సార్లు తలపడగా భారత్ నాలుగు సార్లు, ఆసీస్ రెండు సార్లు విజయాలను అందుకున్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియాలు నాలుగు సార్లు తలపడ్డాయి. ఇందులో చెరో రెండు సార్లు విజయాలను సాధించాయి.
Champions Trophy : ‘నువ్వు అలా చేయాల్సింది కాదు..’ జడేజా పై కివీస్ మాజీ ఆటగాడు తీవ్ర ఆగ్రహం..
ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య మొత్తం 151 వన్డే మ్యాచ్‌లు జరగగా.. భారత్ 57 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఆస్ట్రేలియా 84 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
పిచ్ ఎలా ఉండనుంది..
దుబాయ్‌లో పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. బాల్ కాస్త ఆగి బ్యాట్ పైకి వస్తుంది. క్రీజులో కుదురుకుంటే బ్యాటింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ మైదానంలో రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్లు 60 శాతానికి పైగా విజయాలను అందుకున్నాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గు చూపించవచ్చు.
మరిచిపోలేని ఆ రెండు ఫైనల్ మ్యాచ్‌లు..
మిగిలిన మ్యాచ్‌లు సంగతి ఎలా ఉన్నా సరే సగటు భారత క్రికెట్ అభిమానులు మాత్రం ఓ రెండు మ్యాచ్‌లను ఎన్నటికి మరిచిపోలేరు. అది 2003, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లు. తొలుత సౌరవ్ గంగూలీ నాయకత్వంలో 2003లో భారత్ ఫైనల్ లో ఆసీస్ చేతిలో భంగపడగా, 2023లో రోహిత్ శర్మ నాయకత్వంలో వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువచ్చిన భారత్ కు ఆసీస్ షాకిచ్చింది.
ఈ రెండు ఓటములను భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సెమీస్ మ్యాచ్‌లో ఆసీస్ ఓడించి వాటికి ఘన ప్రతీకారాలు తీర్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.