Mohammed Shami: టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీపై విమర్శలు.. మహాపాపి, నేరగాడు అంటూ..

టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది బహిరంగంగా విమర్శలు చేస్తుండగా.. మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు దిగుతున్నారు.

Mohammed Shami: టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీపై విమర్శలు.. మహాపాపి, నేరగాడు అంటూ..

Mohammed Shami

Updated On : March 7, 2025 / 11:52 AM IST

Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది బహిరంగంగా విమర్శలు చేస్తుండగా.. మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు దిగుతున్నారు. తాజాగా.. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరెల్వీ మాట్లాడుతూ షమీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మార్చి 4న ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో షమీ కూల్ డ్రింక్ తాగడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

Also Read: నిజంగా నువ్వు గొప్పోడివి సామీ..! బ్యాటింగ్‌కు రావాల్సిన టైంలో నిద్రపోయిన పాక్ క్రికెటర్.. షాకిచ్చిన అంపైర్

షమీ రంజాన్ నెలలో ఉద్దేశ పూర్వకంగా రోజా (ఉపవాసం)ను వదిలేయడం ద్వారా మహా పాపానికి ఒడిగట్టారని షహబుద్దీన్ అన్నారు. రోజాను కొనసాగించకుండా వదిలేసిన షమీ ఓ నేరగాడు, మహాపాపి. ఈ చర్యలపై దేవుడికి కచ్చితంగా షమీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అంటూ షహబుద్దీన్ వ్యాఖ్యానించారు. మరోవైపు కొందరు షమీని సమర్ధిస్తున్నారు. పర్యటనల్లో ఉన్నవారికి రోజా నుంచి వైదొలిగేందుకు మినహాయింపు ఉంటుందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎగ్జిక్యూటివ్ మెంబర్ మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగీ మహ్లీ పేర్కొన్నారు.

Also Read: ఫైనల్ మ్యాచ్ కోసం హార్దిక్ పాండ్యా ఎలా కష్టపడుతున్నాడో చూడండి.. !

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హసీం ఆమ్లా పేరును ప్రస్తావిస్తూ కొందరు షమీపై ట్రోల్స్ కు దిగుతున్నారు. ఆమ్లా గతంలో ఫాస్టింగ్ (రోజా) ఉండి మ్యాచ్ ఆడాడని, కానీ, షమీ రోజా పాటించకుండా మ్యాచ్ ఆడటంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే, మధ్యాహ్నం భగభగ మండే ఎండలో గంటకు 140 కిలో మీటర్ల వేగంతో ఓ పది ఓవర్లు బౌలింగ్ వేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి.. బౌలర్లు రోజా పాటిస్తూ మ్యాచ్ ఆడటం అంత తేలికైన విషయం కాదు అంటూ షమీని సపోర్ట్ చేస్తూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంపై షమీ కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. పాకిస్థాన్ వాళ్లు కూడా రోజా పాటించకుండానే మ్యాచ్ ఆడుతున్నారని, షమీ చేసినదాంట్లో తప్పేంలేదని అంటున్నారు.

 

ఇటీవల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ బాడీషేమింగ్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా.. మహ్మద్ షమీ విషయంపై ఆమె ఏఎన్ఐతో మాట్లాడారు.. ‘ఇస్లాంలో రంజాన్ మాసంకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఉపవాసం (రోజా) ఉండాల్సిన అవసరం లేదు. మహమ్మద్ షమీ ప్రయాణిస్తున్నాడు. అతను తన సొంత స్థలంలో లేడు. అతను క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ క్రీడ సమయంలో తేలిగ్గా అలిసిపోతారు. దీంతో నీరు తాగాల్సి ఉంటుంది. ఏదైనా క్రీడ ఆడుతున్నప్పుడు ఉపవాసం ఉండాలని ఎవరూ పట్టుబట్టరు’’ అంటూ ఆమె పేర్కొంది.