England Cricket Corona : ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో ఏడుగురికి కరోనా

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. క్రికెట్ జట్టులో ఏడుగురికి కరోనా బారిన పడ్డారు.

England Cricket Corona : ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో ఏడుగురికి కరోనా

Corona Positive For Seven Members Of The England Cricket Team

Updated On : July 6, 2021 / 6:42 PM IST

England cricket Corona : ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. క్రికెట్ జట్టులో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే కరోనా సోకిన వారి పేర్లను మాత్రం ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించలేదు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు ఐసోలేషన్ లో ఉందని ఆ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆదివారం శ్రీలంకతో మూడో వన్డే ముగిసిన తర్వాత ఆటగాళ్లకు, సిబ్బందికి సోమవారం పరీక్షలు నిర్వహించగా జట్టులో ఏడుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

మరోవైపు ఇంగ్లాండ్ బుధవారం నుంచి పాకిస్తాన్ తో ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడాల్సివుంది. అయితే, కార్డిఫ్ లో జరగాల్సిన తొలి వన్డే షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఈసీబీ మంగళవారం తెలిపింది. దీంతో బెన్ స్టోక్స్ కెప్టెన్సీ ఆధ్వర్యంలో కొత్త జట్టును ఎంపిక చేయాలని నిర్ణయించింది.