Cricket Is King: ఫిఫా ప్రపంచ కప్‌కు టీమిండియాకు ఆహ్వానం

ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022కు భారత క్రికెటర్లకు ఆహ్వానం అందింది. అది కూడా 1983, 2011లలో ప్రపంచ కప్ గెలిచిన ప్రపంచ కప్ జట్టు ప్లేయర్లకు మాత్రమే. ఖతర్ వేదికగా జరగనున్న ఈ టోర్నీకి వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ రావాలంటూ ఫిఫా వరల్డ్ కప్ 2019 ఖతర్ సీఈఓ నాజిర్ అల్ ఖాతెర్ ఆహ్వానించారు. ఆయన ముంబైలో జరిగిన అవార్డు ఫంక్షన్‌కు హాజరై ఇలా మాట్లాడాడు.
‘2022లో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్ 2022కు భారత క్రికెటర్లు రావాలని కోరుకుంటున్నాను. చూస్తుండగానే భారత క్రికెట్ మంచి పురోగతి సాధించింది. ఖతర్ వేదికగా జరగనున్న క్రీడా మహోత్సవం ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు మీకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని నాజిర్ తెలిపాడు. భారత్‌లో క్రికెట్‌కు విశేషాదరణ ఉందని అందుకే క్రికెటర్లకు ప్రత్యేక ఆహ్వనం ఇస్తున్నానని వెల్లడించాడు.
వన్డే ఫార్మాట్‌లో భారత్ ప్రపంచ కప్ గెలిచుకోవడానికి 28 ఏళ్లు గ్యాప్ తీసుకుంది. 1983 జూన్ 25న లార్డ్స్ వేదికగా వెస్టిండీస్ జట్టుతో తలపడిన భారత్.. కపిల్ దేవ్ కెప్టెన్సీలో ప్రపంచ కప్‍ను ముద్దాడింది. ఆ తర్వాత 2011 ఏప్రిల్ 2న భారత్ రెండో ప్రపంచ కప్‌ను వాంఖడే వేదికగా శ్రీలంకపై గెలిచి దక్కించుకుంది.