MS Dhoni : హైద‌రాబాద్‌లో అడుగుపెట్టిన ధోని..

ఐపీఎల్ ట్రోఫీని ఐదు సార్లు సొంతం చేసుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) జ‌ట్టు హైద‌రాబాద్‌కు చేరుకుంది.

MS Dhoni : హైద‌రాబాద్‌లో అడుగుపెట్టిన ధోని..

CSK arrive in Hyderabad ahead of clash against SRH

Dhoni : ఐపీఎల్ ట్రోఫీని ఐదు సార్లు సొంతం చేసుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) జ‌ట్టు హైద‌రాబాద్‌కు చేరుకుంది. ఈ సీజ‌న్‌ను వ‌రుస విజ‌యాల‌తో ఆరంభించిన చెన్నై విశాఖ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మాత్రం త‌డ‌బ‌డింది. 20 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది. మొత్తంగా ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచులు ఆడ‌గా రెండింటిలో గెలిచి ఓ మ్యాచ్‌లో ఓడిపోయి పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం మూడో స్థానంలో కొన‌సాగుతోంది.

ఈ సీజ‌న్‌లో చెన్నై జ‌ట్టు త‌న త‌దుప‌రి మ్యాచ్‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌)తో ఆడ‌నుంది. ఏప్రిల్ 5 శుక్ర‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ క్ర‌మంలో విశాఖ నుంచి బ‌య‌లుదేరిన రుతురాజ్ సేన‌ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్ర‌యంలో అడుగుపెట్టింది. చెన్నై జ‌ట్టుకి అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ధోని నామ‌స్మ‌ర‌ణ‌తో అక్క‌డి ప‌రిస‌రాలు మారుమోగిపోయాయి.

Sanju Samson : సంజూ శాంస‌న్ గేమ్ ఛేంజ‌ర్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. ముంబై ఓట‌మి మొద‌లైంది అక్క‌డే..

చెన్నై జ‌ట్టు ఆట‌గాళ్లు ఎయిర్‌పోర్టును వీడేంత వ‌ర‌కు ఫ్యాన్స్ హంగామా చేశారు. ప్ర‌త్యేక వాహ‌నాల్లో భారీ బందోబ‌స్తు మ‌ధ్య సీఎస్‌కే ఆట‌గాళ్లు వారు బ‌స చేసే హోట‌ల్‌కు చేరుకున్నారు.

విశాఖ‌లో చెన్నై జ‌ట్టు ఓడిపోయిన‌ప్ప‌టికీ ధోని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో 37 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. అత‌డి ఇన్నింగ్స్ మునుప‌టి ధోనిని గుర్తు చేసింది. ఇక హైద‌రాబాద్‌లోనూ ధోని చెల‌రేగాల‌ని అత‌డి అభిమానులు కోరుకుంటున్నారు.

IPL 2024 : ఈ సీజ‌న్‌లో అత్యంత వేగ‌వంత‌మైన బంతిని సంధించిన ముంబై పేస‌ర్‌.. స్పీడు ఎంతంటే?