KKR vs CSK : ప్రాక్టీస్ సెషన్లలలో కనిపించని ఎంఎస్ ధోని.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆడతాడా? ఆడడా?
ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం కోల్‌కతాకు ఎంతో కీలకం. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసుకు దూరం అయిన చెన్నై.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి ఫ్యాన్స్‌ను ఉత్సాహపరచాలని భావిస్తోంది.
కాగా మ్యాచ్ ముందు సీఎస్‌కే ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించగా.. వీటికి కెప్టెన్ ఎంఎస్ ధోని దూరంగా ఉన్నాడు. దీంతో అతడి ఫిట్‌నెస్ పై ఊహాగానాలు చెలరేగాయి. ఈ క్రమంలో కేకేఆర్‌తో మ్యాచ్‌లో అతడు ఆడతాడో లేదో అని సందేహలు అభిమానుల్లో నెలకొన్నాయి. దీనిపై సీఎస్‌కే బౌలింగ్ కోచ్ ఎరిక్ సైమన్స్ స్పందించాడు.
Operation Sindoor : ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం.. ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ వాయిదా పడుతుందా?
మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎరిక్ మాట్లాడుతూ.. ధోనికి ఎలాంటి గాయం కాలేదన్నాడు. కోల్‌కతాతో మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగుతాడని వెల్లడించాడు. అదే సమయంలో ప్రాక్టీస్‌కు ధోని ఎందుకు కాలేదో వివరించాడు.
‘పరిస్థితులపై ఎంఎస్ ధోనికి పూర్తి అవగాహన ఉంది. ఈ సీజన్‌లో తాను ఎలా ఆడుతున్నాడో అన్న దానిపై అతడికి ఓ స్పష్టత ఉంది. ప్రతి సీజన్ ప్రారంభంలో అతడు ఎంతో కష్టపడి పని చేస్తాడు. రాణించాలంటే ఏం చేయాలన్నది తెలుసు. అందుకనే ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలన్నది అతడి తెలుసు.’ అని ఎరిక్ తెలిపాడు.
MI vs GT : గుజరాత్ చేతిలో ఓటమి.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ బిగ్ షాక్..
ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ధోని భవిష్యత్తు పై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ సీజన్ అతడికి చివరిదా, లేదా మరో సీజన్ ఆడతాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.