Operation Sindoor : ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం.. ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ వాయిదా పడుతుందా?
జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేసింది కేంద్రం.

Operation Sindoor impact on IPLwith airports shut Dharamsala travel plans hit
పహల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంటోంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపు దాడులకు పాల్పడింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర భారతదేశంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలను తెరవద్దని ఆదేశాల్లో స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయంతో ఆయా ఎయిర్ పోర్టుల్లో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.
MI vs GT : గుజరాత్ చేతిలో ఓటమి.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ బిగ్ షాక్..
ధర్మశాల ఎయిర్ పోర్టు మూసి వేయడంతో ఆ ప్రభావం ఐపీఎల్‌లో కొన్ని జట్ల ప్రయాణ ప్రణాళికలపై ప్రభావం చూపనుంది. మే 8న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, మే 11న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఇప్పటికే పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ధర్మశాలకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుంటే గురువారం షెడ్యూల్ ప్రకారమే పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ జరగనున్నట్లు తెలిపింది. ధర్మశాలతో పాటు చుట్టుపక్కల ఉన్న అమృత్ సర్, చండీగఢ్ విమానాశ్రయాలు మూసివేయడంతో బీసీసీఐ జట్ల ప్రయాణానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
‘మనం ప్రస్తుతానికి వేచి చూడాలి. వేరే మార్గం లేదు. ఎందుకంటే చండీగఢ్ విమానాశ్రయం కూడా మూసివేయబడింది. కాబట్టి ఏమి చేయాలో మనం చూడాలి. రెండు జట్లు ఇప్పటికే ఇక్కడ ఉన్నాయి. మే 11న జరిగే మ్యాచ్ కోసం ముంబై ఈ వారం చివర్లో చేరుకోవాల్సి ఉంది. ఢిల్లీ విమానాశ్రమం మాత్రమే ఇక్కడకు దగ్గరగా ఉంది. అంటే రెండు జట్లు కూడా సుదీర్ఘ రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాము. ప్రభుత్వం నిర్ణయం మేరకు నిర్ణయాలు తీసుకుంటాం.’ అని బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపినట్లు వెల్లడించింది.
మంగళవారం వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలోనే ఉంది.