Mumbai Indians playoff scenario : ఓరి నాయనో.. ఒక్క ఓటమితో మారిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ సమీకరణం.. హార్దిక్ ఇప్పుడేం చేస్తాడో..?
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది ముంబై ఇండియన్స్.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే రేసు నుంచి నిష్ర్కమించగా మరో ఏడు జట్లు నాలుగు స్థానాల కోసం పోటీపడుతున్నాయి.
మంగళవారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకువెళ్లింది. ఈ ఓటమితో ముంబై మూడో స్థానం నుంచి నాలుగుకు పడిపోయింది.
ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 14 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +1.156గా ఉంది. గుజరాత్ చేతిలో ఓడిపోవడంతో ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు కాస్త సంక్లిష్టం అయ్యాయి.
రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిందే..
ఈ సీజన్‌లో ముంబై లీగ్ దశలో మరో రెండు మ్యాచ్‌లు.. మే 11న పంజాబ్ కింగ్స్, మే 15న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ముంబై విజయం సాధిస్తే.. అప్పుడు ఆ జట్టు ఖాతాలో 18 పాయింట్లు ఉంటాయి. దీంతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ముంబై ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.
MI vs GT : గుజరాత్ పై ఓటమి.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కామెంట్స్ వైరల్.. సంతోషంగా ఉంది..
ఇందులో ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకునేందుకు కష్టం అవుతుంది. అప్పుడు మిగిలిన జట్ల సమీకరణాలు కలిసి రావడంతో పాటు నెట్‌రన్‌రేట్ ఆధారంగా ముంబై ప్లేఆఫ్స్ చేరుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే మాత్రం ముంబై ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమిస్తుంది.