Gujarat Titans : చరిత్ర సృష్టించిన గుజరాత్ టైటాన్స్.. ఆర్‌సీబీ, ముంబై, మరే జట్టుకు సాధ్యం కాలే.. ఐపీఎల్‌లో ఒకే ఒక టీమ్..
గుజరాత్ టైటాన్స్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. మంగళవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో మూడు వికెట్లతో విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు గుజరాత్ 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.793గా ఉంది.
మంగళవారం గుజరాత్ టైటాన్స్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు చెందిన ముగ్గురు బ్యాటర్లు 500కి పైగా పరుగులు సాధించారు. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు తరుపున ఓ సీజన్‌లో ముగ్గురు ఆటగాళ్లు 500 పరుగులకు పైగా చేయడం ఇదే తొలిసారి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్, జోస్ బట్లర్‌లు ఈ సీజన్‌లో 500 ఫ్లస్ రన్స్ చేశారు.
MI vs GT : వర్షం ఎక్కడ.. అంపైర్లపై ఆశిష్ నెహ్రా, రాహుల్ తెవాటియా ఆగ్రహం..
సాయి సుదర్శన్ 11 మ్యాచ్‌ల్లో 46.27 సగటుతో 153.31 స్ట్రైక్‌రేటుతో 509 పరుగులు చేశాడు. ఇక గిల్ విషయానికి వస్తే.. 11 మ్యాచ్‌ల్లో 50.80 సగటు 152.55 స్ట్రైక్‌రేటుతో 508 పరుగులు సాధించాడు. జోస్ బట్లర్ 11 ఇన్నింగ్స్‌ల్లో 71.43 సగటు 163.93 స్ట్రైక్‌రేటుతో 500 పరుగులు సాధించాడు.
ఇక ముంబై, గుజరాత్ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో విల్ జాక్స్ (35 బంతుల్లో 53 పరుగులు), సూర్యకుమార్ (24 బంతుల్లో 35 పరుగులు) రాణించారు. గుజరాత్ బౌలర్లలో సాయికిశోర్ రెండు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, జెరాల్డ్ కోట్జీ తలా ఓ వికెట్ సాధించారు.
MI vs GT : గుజరాత్ పై ఓటమి.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కామెంట్స్ వైరల్.. సంతోషంగా ఉంది..
అనంతరం గుజరాత్ లక్ష్య ఛేదన సందర్భంగా పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం వల్ల రెండోసారి ఆట నిలిచే సమయానికి గుజరాత్ 18 ఓవర్లలో 132/6 స్కోరుతో నిలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను ఒక ఓవర్‌కు కుదించి గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147గా నిర్ణయించారు. దీంతో ఆఖరి ఓవర్‌లో గుజరాత్ గెలుపుకు 15 పరుగులు అవసరం అయ్యాయి. దీపక్ చాహర్ వేసిన ఆ ఓవర్‌లో 15 పరుగులు చేసి ఆఖరి బంతికి గుజరాత్ విజయాన్ని అందుకుంది.