MI vs GT : గుజరాత్ చేతిలో ఓటమి.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ బిగ్ షాక్..
గుజరాత్ చేతిలో ఓడిపోయిన బాధలో ఉన్న ముంబైకి భారీ షాక్ తగిలింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మంగళవారం వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్‌లూయిస్ పద్దతిలో ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ముంబై పాయింట్ల పట్టికలో మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. దీంతో ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు కాస్త సంక్లిష్టం అయ్యాయి. గుజరాత్ చేతిలో ఓడిపోయిన బాధలో ఉన్న ముంబైకి భారీ షాక్ తగిలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ ఫైన్ వేసింది.
గుజరాత్ తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్లో ఓవర్ రేటును నమోదు చేసింది. ఈ సీజన్‌లో ముంబై నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోవడం ఇది రెండో సారి. దీంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.24లక్షల జరిమానాను బీసీసీఐ విధించింది.
MI vs GT : భువనేశ్వర్‌కుమార్ రికార్డు బ్రేక్.. ఎలైట్ లిస్ట్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు చోటు..
అంతేకాదండోయ్.. ఇంపాక్ట్ ప్లేయర్, కంకషన్ సబ్స్టిట్యూట్‌తో పాటు ప్లేయింగ్ ఎలెవన్‌లోని ముంబై ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.6లక్షలు లేదంటే మ్యాచ్ ఫీజులో 25 శాతం రెండింటిలో ఏది తక్కువ అయితే అది జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది.
అటు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించబడింది. అంతేకాదండోయ్ ఒక డీమెరిట్ పాయింట్ ను చేర్చింది. అయితే.. నెహ్రా ఏ నిబంధనను ఉల్లంఘించాడు అన్నది స్పష్టం పేర్కొనలేదు. కాగా.. అతడు వర్షం కారణంగా ఆట పలుమార్లు నిలిచిపోయినప్పుడు అంపైర్లతో చర్చలు చేస్తూ కనిపించాడు. ఆ సమయంలో అతడు కాస్త కోపంగా ఉన్నాడు.
చేసిన నేరాన్ని, శిక్షను నెహ్రా అంగీకరించాడని దీంతో తదుపరి ఎలాంటి విచారణ ఉండదని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.