CSKvMI: ఓటమి రుచి చూసిన చెన్నై

CSKvMI: ఓటమి రుచి చూసిన చెన్నై

Updated On : April 3, 2019 / 9:30 PM IST

చెన్నై వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఐపీఎల్ 12 సీజన్ ఆరంభం నాటి నుంచి ఓటమి ఎరుగక దూసుకెళ్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ తొలి సారి ఓటమి రుచి చూసింది. ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై ధోనీ సేనను ఒత్తిడిలోకి నెట్టి 37 పరుగుల ఘన విజయాన్ని అందుకుంది. 

చేధనకు దిగిన సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ ఆదిలోనే తడబడడంతో ముంబైకు చెన్నైని ఓడించడం సులువైపోయింది. షేన్ వాట్సన్(5),  అంబటి రాయుడు (0), సురేశై రైనా(16)వికెట్ల పతనం చెన్నై జట్టులో భయాన్ని పురిగొల్పింది.

కేదర్ జాదవ్(58)ఒంటరి పోరాటం చేసినప్పటికీ లాభం లేకుండాపోయింది. ముంబై బౌలర్ల ధాటి పెరగడంతో అప్పటికే ఒత్తిడికి లోనైన చెన్నై రవీంద్ర జడేజా(1), బ్రావో(8), దీపక్ చాహర్(7), శార్దూల్ ఠాకూర్(12), మోహిత్ శర్మ(0)వరుస వికెట్లను కోల్పోయింది. ముంబై బౌలర్లలో బహ్రెండార్ఫ్(2)వికెట్లు తీయగా లసిత్ మలింగ, హార్దిక్ పాండ్య చెరో 3వికెట్లు తీయగలిగారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పాండ్యానే వరించింది. 

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై.. చెన్నైకు 171 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా అద్భుతమైన స్కోరు నమోదు చేశాడు. కేవలం 8 బంతుల్లో 3  సిక్సులు, 1 ఫోర్ కలిపి 25 పరుగులు చేశాడు. 

ఓపెనర్లు క్వింటన్ డికాక్(4), రోహిత్ శర్మ(13)పరుగులతో నిరాశపరిచారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్(59), యువరాజ్ సింగ్(4), కృనాల్ పాండ్యా(42), కీరన్ పొలార్డ్ (17)లు చక్కగా రాణించారు. 
 
చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ తొలి వికెట్ పడగొట్టగా, ఆ తర్వాత మోహిత్ శర్మ, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజా, డేన్ బ్రావో చెరో వికెట్ పడగొట్టారు.