CSKvMI: చెన్నై టార్గెట్ 171

సొంతగడ్డపై ముంబై బ్యాట్స్ మెన్ విజృంభించారు. ఈ క్రమంలో చెన్నైకు 171 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా అద్భుతమైన స్కోరు నమోదు చేశాడు. కేవలం 8 బంతుల్లో 3 సిక్సులు, 1 ఫోర్ కలిపి 25 పరుగులు చేశాడు.
ఓపెనర్లు క్వింటన్ డికాక్(4), రోహిత్ శర్మ(13)పరుగులతో నిరాశపరిచారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్(59), యువరాజ్ సింగ్(4), కృనాల్ పాండ్యా(42), కీరన్ పొలార్డ్ (17)లు చక్కగా రాణించారు.
చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ తొలి వికెట్ పడగొట్టగా, ఆ తర్వాత మోహిత్ శర్మ, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజా, డేన్ బ్రావో చెరో వికెట్ పడగొట్టారు.