ఆర్సీబీకి షాక్: డేల్ స్టెయిన్ ఐపీఎల్‌కు దూరం

  • Published By: vamsi ,Published On : April 25, 2019 / 10:45 AM IST
ఆర్సీబీకి షాక్: డేల్ స్టెయిన్ ఐపీఎల్‌కు దూరం

Updated On : April 25, 2019 / 10:45 AM IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫేసర్ డేల్ స్టెయిన్ ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్లో నాథన్ కౌల్టర్ నైల్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఇటీవల జట్టులో స్థానం దక్కించుకున్నాడు డేల్ స్టెయిన్. ఆడిన ప్రతి మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టి కెప్టెన్ కోహ్లీ మన్ననలు అందుకున్నాడు. 

ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలకమైన షేన్ వాట్సన్, సురేశ్ రైనా వికెట్లు పడగొట్టి ప్రశంసలు పొందాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో సత్తా చాటాడు. దాదాపు జట్టుకు డేల్ స్టెయిన్ ప్రధాన బలమని భావిస్తున్న తరుణంలో గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకోవడం చాలా దురదృష్టకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఆర్సీబీ చైర్మన్ సంజీవ్ చూరివాలా మాట్లాడుతూ.. స్టెయిన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. అతను జట్టుతో కలసి ప్రయాణించడం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో కోలుకుంటాడని నమ్మకాలు లేవు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అని వివరించాడు. 

2016లో ఆస్ట్రేలియాతో ఆడుతోన్న మ్యాచ్‌లో స్టెయిన్ భుజానికి గాయమైంది. ఈ కారణంగానే రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైయ్యాడు. ఆ తర్వాత 2016లో గుజరాత్ లయన్స్ తరపున ఆడాడు. 2018, 2019 వేలంలో స్టెయిన్‌ను ఎవరూ కొనుగోలు చేయకపోవడం ఆశ్చర్యకరం.