David Warner retirement : సెమీస్‌కు చేర‌డంలో ఆస్ట్రేలియా విఫ‌లం.. అంతర్జాతీయ క్రికెట్‌కు డేవిడ్ వార్న‌ర్ గుడ్ బై..

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు డేవిడ్ వార్న‌ర్ గుడ్ బై చెప్పేశాడు.

David Warner retirement : సెమీస్‌కు చేర‌డంలో ఆస్ట్రేలియా విఫ‌లం.. అంతర్జాతీయ క్రికెట్‌కు డేవిడ్ వార్న‌ర్ గుడ్ బై..

David Warner international retirement confirmed after Australia exit

David Warner : అంత‌ర్జాతీయ క్రికెట్‌కు డేవిడ్ వార్న‌ర్ గుడ్ బై చెప్పేశాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో ఆస్ట్రేలియా జ‌ట్టు సెమీస్‌కు చేర‌డంలో విఫ‌లం కావ‌డంతో వార్న‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది. ఇప్ప‌టికే వ‌న్డేలు, టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన వార్న‌ర్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌న అంత‌ర్జాతీయ కెరీర్‌లో చివ‌రిది అని ఎప్పుడో చెప్పేసిన సంగ‌తి తెలిసిందే.

మంగ‌ళ‌వారం ఉత్కంఠభ‌రితంగా సాగిన‌ అఫ్గానిస్తాన్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అఫ్గాన్ జ‌ట్టు డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 8 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించ‌డంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్ర్క‌మించ‌క త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలో వార్నర్ అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్ ఇక్క‌డితో ఆగిపోయింది. సోమ‌వారం టీమ్ఇండియాతో ఆడిన మ్యాచే వార్న‌ర్ కెరీర్‌లో ఆఖ‌రి మ్యాచ్ అయింది. భార‌త్‌తో మ్యాచ్‌లో వార్న‌ర్ 6 బంతులు ఆడి కేవ‌లం 6 ప‌రుగులే చేశాడు.

Afghanistan : సెమీస్‌కు చేరిన అఫ్గానిస్తాన్‌.. దేశంలో అంబ‌రాన్ని అంటిన సంబ‌రాలు.. వేల సంఖ్య‌ల్లో వీధుల్లోకి వ‌చ్చిన ఫ్యాన్స్‌..

2009లో వార్న‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. త‌న తొలి టీ20 మ్యాచ్‌ను ద‌క్షిణాఫ్రికా పై ఆడాడు. కేవ‌లం 43 బంతుల్లోనే 89 ప‌రుగులు చేసి త‌న క్రికెట్ కెరీర్‌ను ఘ‌నంగా ప్రారంభించాడు. అదే ఏడాది వ‌న్డేల్లో అడుగుపెట్ట‌గా, 2011లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు.

మొత్తంగా త‌న సుదీర్ఘ కెరీర్‌లో వార్న‌ర్ ఆస్ట్రేలియా త‌రుపున 112 టెస్టులు, 161 వ‌న్డేలు, 110 టీ20 మ్యాచులు ఆడాడు. 112 టెస్టుల్లో 44.6 స‌గ‌టుతో 8786 ప‌రుగులు చేశాడు. ఇందులో 26 సెంచ‌రీలు, 37 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక 161 వ‌న్డేల్లో 45.3 స‌గ‌టుతో 6932 ప‌రుగులు చేశాడు. ఇందులో 22 శ‌త‌కాలు, 33 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. 110 టీ20ల్లో 33.4 స‌గ‌టుతో 3277 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, 28 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

AFG vs BAN : స‌రిపోయారు.. ఇద్ద‌రూ ఇద్ద‌రే.. అఫ్గాన్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కామెడీ ఎర్ర‌ర్‌..