De Kock : దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ.. టెస్ట్‌ సిరీస్‌కు డికాక్ దూరం!

టీమిండియాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్న దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ టెస్టు సిరీస్ కు దూరం కానున్నాడు.

De Kock : దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ.. టెస్ట్‌ సిరీస్‌కు డికాక్ దూరం!

De Kock Set To Miss Part Of India Test Series (1)

Updated On : December 13, 2021 / 10:25 PM IST

De Kock :  టీమిండియాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్న దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ టెస్టు సిరీస్ కు దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా డికాక్ భారత జట్టుతో జరుగబోయే టెస్టు సిరీస్‌లో రెండు లేదా మూడు టెస్టులకు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు జట్టు సెలక్షన్ కన్వీనర్ విక్టర్ పిట్సాంగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. వచ్చే ఏడాది 2022 జనవరిలో డికాక్ భార్య సశా బిడ్డకు జన్మనివ్వనుంది.

భార్య ప్రసవించే సమయంలో తాను దగ్గర ఉండాల్సిన అవసరం ఉండటంతో డికాక్ పితృత్వపు సెలవులు తీసుకుంటున్నట్టు విక్టర్ ప్రకటించాడు. బయో-బబుల్, ఇతర పరిమితుల కారణంగా అతను రెండో సిరీస్ కూడా దూరమయ్యే అవకాశం ఉందని ESPNcricinfo నివేదిక తెలిపింది. క్రికెట్ పోర్టల్ ప్రకారం.. దక్షిణాఫ్రికా ఎంపిక కన్వీనర్ విక్టర్ డి కాక్ చివరి టెస్ట్‌కు దూరమవుతాడని తెలిపాడు. డికాక్ చివరిసారిగా UAEలో జరిగిన T20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా తరపున ఆడాడు. అక్కడ డికాక్ ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ మద్దతుగా క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) ఆదేశాన్ని అనుసరించి రెండవ గ్రూప్ నుంచి వైదొలిగాడు.

డికాక్‌ గైర్హాజరీలో ర్యాన్ రికెల్టన్‌, కైల్ వెర్రిన్ లతో వికెట్‌కీపింగ్ బాధ్యతలను అప్పగించనున్నారు. మూడు టెస్ట్‌ల సిరీస్‌ కోసం టీమిండియా డిసెంబర్‌ 16న దక్షిణాఫ్రికాకు బయల్దేరనుంది. భారత పర్యటనలో భాగంగా సెంచూరియన్‌ వేదికగా డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు తొలి టెస్ట్‌ జరుగనుంది. జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా వచ్చే ఏడాది 2022 జనవరి 3 నుంచి 7 వరకు రెండో టెస్ట్‌ జరుగనుంది. కేప్‌టౌన్‌ వేదికగా జనవరి 11 నుంచి జనవరి 15 వరకు మూడో టెస్ట్‌ జరుగనుంది. ఆ తర్వాత జట్లు మూడు వన్డేలు ఆడనున్నాయి.

Read Also : Omicron Variant: పాకిస్తాన్‌లో ఫస్ట్ ఒమిక్రాన్‌ కేసు