IPL 2021 : మోకాళ్లపై కూర్చొని గర్ల్ ఫ్రెండ్‌‌కు ప్రపోజ్ చేసిన దీపక్ చాహార్

చాహార్ గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్ కూడా వచ్చారు. ఆమె స్టాండ్స్ లో కూర్చొని మ్యాచ్ చూశారు. మ్యాచ్ అయిపోయిన అనంతరం గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి చాహార్ వచ్చారు.

IPL 2021 : మోకాళ్లపై కూర్చొని గర్ల్ ఫ్రెండ్‌‌కు ప్రపోజ్ చేసిన దీపక్ చాహార్

Chahar

Updated On : October 8, 2021 / 9:06 AM IST

Deepak Chahar Proposes : ఐపీఎల్ మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. పంజాబ్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాభవం చవి చూసింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్…వీర విహారం చేసి..ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించాడు. అందరూ రాహుల్ గురించి మాట్లాడుకోవడం మానేసి…చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చాహార్ ట్రెండింగ్ లో నిలిచాడు. సోషల్ మీడియాలో అతని ఫొటోలు వైరల్ చేస్తున్నారు. ఒంటి చేత్తో గెలిపించిన రాహుల్ గురించి కాకుండా..చాహార్ గురించి మాట్లాడుకోవడం ఎందుకు ? అని ఆశ్చర్యపోతున్నారా ? మ్యాచ్ చూసిన వాళ్లకు ఆ విషయం తెలుసు.

Read More : IPL 2021 RR Vs KKR భారీ విజయంతో ప్లేఆఫ్స్‌కు కోల్‌కతా..! ముంబై ఔట్..!

అసలు ఏం జరిగింది ?

ఈ మ్యాచ్ కు చాహార్ గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్ కూడా వచ్చారు. ఆమె స్టాండ్స్ లో కూర్చొని మ్యాచ్ చూశారు. మ్యాచ్ అయిపోయిన అనంతరం గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి చాహార్ వచ్చారు. ఆమె ముందట..మోకాళ్ల మీద కూర్చొని ప్రపోజ్ చేశాడు. స్టేడియంలో అందరూ చూస్తుండగా..ఆమె చేతికి రింగ్ తొడిగాడు. చాహార్ క్యూట్ ప్రపోజల్ తో గర్ల్ ఫ్రెండ్ చిరునవ్వులు చిందించింది. ఆనందంతో ఉప్పోంగిపోయారు. ఎస్ చెబుతూ..చాహార్ ను కౌగలించుకున్నారు. స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. అక్కడున్న వారు తమ సెల్ ఫోన్ లలో బంధించి..సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ గా మారాయి. స్వయంగా చాహార్ తన ఇన్ స్ట్రాగ్రామ్ పేజీలో వీడియోను పోస్టు చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Deepak Chahar (@deepak_chahar9)