IPL 2021 RR Vs KKR భారీ విజయంతో ప్లేఆఫ్స్‌కు కోల్‌కతా..! ముంబై ఔట్..!

ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా ఘన విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో రాజస్తాన్ ను చిత్తు చేసింది. 172 పరుగు

IPL 2021 RR Vs KKR భారీ విజయంతో ప్లేఆఫ్స్‌కు కోల్‌కతా..! ముంబై ఔట్..!

Kolkata Won By 86 Runs On Rajasthan

IPL 2021 RR Vs KKR : ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ప్లేఆఫ్స్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోల్ కతా రెచ్చిపోయింది. రాజస్తాన్ పై భారీ విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో రాజస్తాన్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకున్నట్టే. హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబయి 171 పరుగుల తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌కి వెళుతుంది. లేకుంటే కోల్‌కతా ప్లేఆఫ్స్‌కి చేరినట్టే. రాజస్తాన్ ఈ ఓటమితో ఇంటి బాట పట్టింది. అలాగే తమతో పాటు ముంబై, పంజాబ్ ను  కూడా ఇంటికి తీసుకెళ్లింది.

Mukesh Ambani : ఇండియాకు 7-ఎలెవెన్ స్టోర్లు.. దేశంలో ఫస్ట్ స్టోర్ ఎక్కడంటే?

172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒత్తిడికి గురై ఓటమి పాలైంది. 16.1 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాజస్తాన్ జట్టులో ముగ్గురు బ్యాట్స్ మెన్(యశస్వి జైశ్వాల్, అర్జున్ రావత్, క్రిస్ మోరిస్) డకౌట్ అయ్యారు. రాహుల్ తెవాటియా (36 బంతుల్లో 44 పరుగులు ) ఒంటరి పోరాటం చేశాడు. కోల్ కతా బౌలర్లలో శివమ్ మావి 4, ఫెర్గుసన్ మూడు వికెట్లు తీశారు. షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ పడగొట్టారు.

Facebook: ఫేస్‌బుక్‌ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు..!

లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ కు తొలి ఓవర్ లోనే గట్టి షాక్‌ తగిలింది. ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌(0)ని షకీబ్‌ హల్‌ హసన్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. శివమ్‌ మావివేసిన తర్వాతి ఓవర్లో సంజు శాంసన్‌(1) మోర్గాన్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఫెర్గూసన్‌ వేసిన నాలుగో ఓవర్లో లివింగ్‌ స్టోన్‌(6), అనుజ్‌ రావత్(0) ఔటయ్యారు. శివమ్‌ దూబే(18) కాసేపు పోరాడాడు. ఫిలిప్స్‌ (8), మోరిస్‌ (0), ఉనద్కత్ (6), సకారియా (1) విఫలమయ్యారు. శివమ్ మావి వేసిన 16.1 బంతికి తెవాటియా చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.

రాజస్తాన్ తో తన చివరి లీగ్ మ్యాచ్ లో కోల్ కతా జట్టు భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్ 56, వెంకటేశ్ అయ్యర్ 38 పరుగులతో రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 79 పరుగులు జోడించి శుభారంభం అందించారు. రాహుల్ త్రిపాఠి 21 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.

ముంబైకి ఒకే ఒక్క చాన్స్..

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈసారి ఐపీఎల్ నుంచి దాదాపుగా ఔట్ అయినట్టే. కాకపోతే ఒక్క ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న రోహిత్ సేన హైదరాబాద్ పై గెలవాలి. అదీ మామూలు విజయం కాదు. ఏకంగా 170 రన్లతో భారీ విజయం సాధించాలి. అలా అయితేనే ప్లే ఆఫ్స్ కు ముంబై వెళ్తుంది. ఇది దాదాపు అసాధ్యం కాబట్టి ముంబై టోర్నీ నుంచి ఔట్ అనే చెప్పాలి.

స్కోర్లు..

కోల్ కతా..171/4

రాజస్తాన్…85 ఆలౌట్(16.1 ఓవర్లు)