బూచోడు కాదమ్మా : ధోనీని చూసి భయపడిన పిల్లోడు

బూచోడు కాదమ్మా : ధోనీని చూసి భయపడిన పిల్లోడు

ధోనీ ఎప్పుడూ క్రికెట్ స్టేడియంలోనే కాదు.. కబడ్డీ, బాడ్మింటన్ ఏ మైదానమైనా తనదే పైచేయి. ఈ క్రమంలోనే తనకెంతో ఇష్టమైన ఫుట్‌బాల్ స్టేడియంలో కనిపించి మెరిశాడు. మంగళవారం ముంబైలో ఓ చారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆడి సత్తా చాటాడు. ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానుల కంటే ధోనీని కలిసేందుకే ఎక్కువమంది ఆసక్తిచూపించారు. 

అడిగిన వారందరినీ నిరాశపరచకుండా ఫొటోలకు ఫోజులిచ్చాడు మహీ. మ్యాచ్ ముగిసిన తర్వాత చాలాసేపు ఫొటోగ్రాఫ్ లతోనే చాలాసేపు గడిపాడు. ఈ క్రమంలోనే ఓ పెద్దావిడ చిన్న పిల్లాడ్ని తీసుకువచ్చింది. చిన్నపిల్లలపై ఎక్కువ ఇష్టం చూపించే ధోనీ ఎత్తుకునేందుకు వస్తావా అని అడిగాడు. దానికి బుడ్డోడు రానంటే రానని మొండికేశాడు. ఎంతసేపటికి నో అంటూనే ఉండడంతో ఏడిపించడం ఇష్టం లేక వదిలేశాడు. 

ఫిబ్రవరి 24నుంచి సొంతగడ్డపై మొదలుకానున్న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లకు టీమిండియా సిద్ధమవుతోంది. జట్టులో భాగమైన ధోనీ మరో సారి తన సత్తా నిరూపించుకోనున్నాడు. కొన్ని మ్యాచ్ లుగా ఫామ్ లో కొనసాగుతున్న ధోనీ.. కీపింగ్ లో ఏ మాత్రం వేగం తగ్గకుండా అదే స్థాయిలో బ్యాటింగ్ లోనూ అదే దూకుడుతో అద్భుతంగా రాణిస్తున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Lil kid says no to #msdhoni ? as is not in the mood.

A post shared by Viral Bhayani (@viralbhayani) on