Men’s T20 World Cup: ఐసీసీ కీలక నిర్ణయం.. డీఆర్ఎస్, డెక్‌వర్త్ లూయిస్‌లో మార్పులు
ఐపీఎల్-2021 తర్వాత యూఏఈ, ఒమన్‌లో అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.

Drs
Men’s T20 World Cup: ఐపీఎల్-2021 తర్వాత యూఏఈ, ఒమన్‌లో అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది పురుషుల టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా డెసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS)ను ఉపయోగించాలని ICC నిర్ణయించింది. ICC అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రతి ఇన్నింగ్స్‌లోనూ, రెండు జట్లకు DRS కింద రెండు సమీక్షలు చేసుకునే అవకాశం కల్పిస్తారు.
టీ20 మ్యాచ్‌లలో ఒక జట్టు ఒక ఇన్నింగ్స్‌లో ఒకే సమీక్షను పొందుతుంది. కానీ కోవిడ్-మహమ్మారి కారణంగా అనేక మ్యాచ్‌లలో అనుభవజ్ఞులైన అంపైర్లు లేరు. దీనిని దృష్టిలో పెట్టుకుని, ICC జూన్‌లో ప్రతి ఫార్మాట్ క్రికెట్‌లో ఒక సమీక్షను పెంచాలని నిర్ణయించింది. ICC తీసుకున్న ఈ నిర్ణయం తరువాత, రూల్స్ ప్రకారం మ్యాచ్‌లో ఇరు జట్లకు రెండు ఇన్నింగ్స్‌లోనూ రెండు రివ్యూలు కోరే అవకాశం కనిపిస్తుంది.
T20 ప్రపంచ కప్‌లో ICC ఆలస్యంగా ప్రారంభమయ్యే లేదా వర్షం కారణంగా ఆగిపోయిన మ్యాచ్‌లకు సంబంధించిన నియమాలను మార్చింది ఐసీసీ. టీ20 ప్రపంచకప్ లీగ్ దశలో ఏవైనా మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగితే, డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితం రావాలంటే ఇకపై ప్రతీ జట్టు కనీసం ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. అదే సెమీ ఫైనల్స్.. ఫైనల్స్‌లో మాత్రం 10 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేస్తేనే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితం వస్తుంది.