ENG vs IND : టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భార‌త్ బ్యాటింగ్‌.. క‌రుణ్ నాయ‌ర్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, జురెల్ ఇన్‌.. బుమ్రా, శార్దూల్ ఔట్‌..

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా ఐదో టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి

ENG vs IND : టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భార‌త్ బ్యాటింగ్‌.. క‌రుణ్ నాయ‌ర్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, జురెల్ ఇన్‌.. బుమ్రా, శార్దూల్ ఔట్‌..

ENG vs IND 5th test England win the toss and elected bowl

Updated On : July 31, 2025 / 3:18 PM IST

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా ఐదో టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. సిరీస్‌లో భార‌త్ 1-2 తేడాతో వెనుక‌బ‌డి ఉంది. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌ను స‌మం చేయాల‌ని టీమ్ఇండియా ప‌ట్టుద‌ల‌గా ఉంది. మ‌రోవైపు ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా, గెలిచినా కూడా సిరీస్ ఇంగ్లాండ్ సొంత‌మ‌వుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.

ఇక భార‌త జ‌ట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం కార‌ణంగా రిష‌బ్ పంత్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. అత‌డి స్థానంలో ధ్రువ్ జురెల్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. వ‌ర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వ‌గా అత‌డి స్థానంలో ప్ర‌సిద్ధ్ కృష్ణ వ‌చ్చాడు. గ‌త మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో బౌలింగ్‌లో తీవ్ర నిరాశ‌ప‌రిచిన శార్దూల్ ఠాకూర్ స్థానంలో క‌రుణ్ నాయ‌ర్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. గ‌త మ్యాచ్‌లో అరంగ్రేటం చేసిన అన్షుల్ స్థానంలో ఆకాశ్ దీప్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.

AUS vs IND : ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టు ఎంపిక.. కెప్టెన్‌గా ఆయుష్ మాత్రే.. వైభ‌వ్ సూర్య‌వంశీకి చోటు..

భార‌త తుది జ‌ట్టు..
య‌శ‌స్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌, సాయి సుద‌ర్శ‌న్‌, శుభ్‌మ‌న్ గిల్ (కెప్టెన్‌), క‌రుణ్ నాయ‌ర్‌, ర‌వీంద్ర జ‌డేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, ఆకాశ్ దీప్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌.

మ‌రోవైపు ఇంగ్లాండ్ కూడా నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతోంది. రెగ్యుల‌ర్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ గాయం కార‌ణంగా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అత‌డి స్థానంలో జాకెబ్ బెథెల్‌కు ఆడుతున్నాడు. ఓలీపోప్ నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టాడు. ఇక జోఫ్రా ఆర్చర్, కార్స్‌లకు విశ్రాంతి ఇవ్వ‌గా.. స్పిన్న‌ర్ డాస‌న్ వేటుప‌డింది. వీరి స్థానాల్లో అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్ జ‌ట్టులోకి వ‌చ్చారు.

WCL 2025 : డ‌బ్ల్యూసీఎల్ టోర్నీ నుంచి భార‌త్ వాకౌట్‌.. ఫైన‌ల్‌కు పాక్‌..

ఇంగ్లాండ్ తుది జ‌ట్టు..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జెమీ స్మిత్, క్రిస్ వోక్స్, ఆట్కిన్సన్, జోష్ టంగ్, ఒవర్టన్.