IND vs ENG: అయ్యో సాయి సుదర్శన్.. ప్లాన్‌చేసి మరీ అవుట్ చేశారుగా.. గంభీర్ రియాక్షన్ వైరల్..

సాయి సుదర్శన్ టెస్టుల్లో అడుగుపెట్టిన తొలి మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్ వ్యూహంలో చిక్కుకొని వికెట్ సమర్పించుకున్నాడు.

IND vs ENG: అయ్యో సాయి సుదర్శన్.. ప్లాన్‌చేసి మరీ అవుట్ చేశారుగా.. గంభీర్ రియాక్షన్ వైరల్..

Sai Sudarshan

Updated On : June 21, 2025 / 9:20 AM IST

IND vs ENG: ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది. తొలిరోజు భారత్ జట్టు ఇంగ్లాండ్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. సెంచరీలతో అదరగొట్టారు. యశస్వి జైస్వాల్ (101), రాహుల్ (42), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 127 పరుగులతో, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే, టెస్టుల్లో అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న సాయి సుదర్శన్ మాత్రం డకౌట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. అయితే, సాయి సుదర్శన్ ను ఇంగ్లాండ్ బౌలర్లు ప్లాన్ చేసి ఔట్ చేశారు.

Also Read: IND vs ENG: ఇదెక్కడి షాట్ రా అయ్యా..! రిషబ్ పంత్ కొట్టిన షాట్‌కు బెన్ స్టోక్స్‌కు దిమ్మతిరిగిపోయింది.. నవ్వుకుంటూ పంత్ దగ్గరకొచ్చి.. వీడియో వైరల్..

సాయి సుదర్శన్ టెస్టుల్లో అడుగుపెట్టిన తొలి మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్ వ్యూహంలో చిక్కుకొని వికెట్ సమర్పించుకున్నాడు. కేవలం నాలుగు బంతులే ఆడిన సాయి సుదర్శన్.. పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు.


కేఎల్ రాహుల్ ఔట్ అయిన తరువాత ఫస్ట్ డౌన్ లో సాయి సుదర్శన్ క్రీజులోకి వచ్చాడు. లంచ్ బ్రేక్ కు ముందు క్రీజులోకి రావడంతో సాయి సుదర్శన్ వికెట్ పడగొట్టి భారత్ పై ఆధిపత్యం సాధించాలిన ఇంగ్లాండ్ బౌలర్లు భావించారు. 25వ ఓవర్లో చివరి బంతికి సాయి సుదర్శన్‌కు స్ట్రయికింగ్ వచ్చింది. దీంతో స్లిప్‌తోపాటు లెగ్ వికెట్ అవతల కూడా కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇద్దరు ఫీల్డర్లను పెట్టాడు. బ్రైడన్ కార్స్ లెగ్ వికెట్ మీదుగా బంతిని వేయగా అది డాట్ అయింది. 26వ ఓవర్ ను బెన్ స్టోక్స్ వేశాడు. పక్కా ప్లాన్ తో సాయి సుదర్శన్ ను ఔట్ చేశాడు.

సాయి సుదర్శన్ లెగ్ వికెట్ టార్గెట్ చేస్తూ బెన్ స్టోక్స్ బౌలింగ్ వేశాడు. మొదటి బంతిని జైస్వాల్ సింగిల్ తీయగా.. రెండో బంతికి సాయి స్ట్రయికింగ్ కు వచ్చాడు. రెండో బంతిని మిడ్ వికెట్ మీదుగా వేయగా.. అది ఎడ్జ్ తీసుకొని స్లిప్ లోకి వెళ్లింది. మూడో బంతిని లెగ్ వికెట్ మీదుగా వేయగా ప్యాడ్‌కుతాకి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. నాలుగో బంతిని లెగ్ వికెట్ బయటకు వేయగా సాయి సుదర్శన్ బ్యాట్ కు టచ్ అయ్యి నేరుగా బంతి కీపర్ చేతిలోకి వెళ్లింది. దీంతో బెన్ స్టోక్స్ ప్లాన్ చేసి సాయి సుదర్శన్ ను డకౌట్ రూపంలో పెవిలియన్ కు పంపించినట్లయింది.


సాయి సుదర్శన్ డకౌట్ కావటంతో కోచ్ గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు.. సాయి సుదర్శన్ డకౌట్ కావడంపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. కొందరు సాయి సుదర్శన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కామెంట్లు చేయగా.. మరికొందరు.. మాత్రం ధో్నీతో పోల్చుతున్నారు. ధోనీ కూడా తన అంతర్జాతీయ కెరీర్‌ను డకౌట్‌తో ప్రారంభించి ఆ తరువాత గొప్ప కెప్టెన్‌గా ఎదిగాడు. సాయి కూడా అలానే అవుతాడా..? అని కామెంట్లు చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన సాయి సుదర్శన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏమేరకు రానిస్తాడో వేచి చూడాల్సిందే.