Ind Vs Eng: రెండో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ స్కోర్ ఎంతంటే..

ఇంగ్లాండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ చెలరేగాడు. 5 వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్‌ వోక్స్‌, లియామ్‌ డాసన్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

Ind Vs Eng: రెండో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ స్కోర్ ఎంతంటే..

Updated On : July 24, 2025 / 11:56 PM IST

Ind Vs Eng: భారత్, ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసింది. 4 వికెట్ల నష్టానికి 264 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఆట మొదలు పెట్టిన భారత్.. 358 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 225 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. జాక్ క్రాలీ, బెన్ డకెట్ ధనాధన్ బ్యాటింగ్ చేశారు. జాక్ క్రాలీ 113 బంతుల్లో 84 పరుగులు, బెన్ డకెట్ 100 బంతుల్లో 94 రన్స్ చేశారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ తీశారు. ఇంగ్లాండ్ ఇంకా 133 పరుగుల వెనుకంజలో ఉంది.

భారత్ బ్యాటింగ్ విషయానికొస్తే రెండో రోజు ఆటలో 94 పరుగులు చేసి చివరి 6 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు కాలికి గాయంతో 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానాన్ని వీడిన రిషబ్ పంత్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఓవైపు కాలి గాయం బాధిస్తున్నా పోరాటపటిమ చూపించాడు. ధైర్య సాహసాలతో క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేశాడు. పంత్ 75 బంతుల్లో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి రోజు ఆటో యశస్వి జైస్వాల్‌ (58), కేఎల్‌ రాహుల్‌ (46), సాయి సుదర్శన్‌ (61) రాణించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ చెలరేగాడు. 5 వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్‌ వోక్స్‌, లియామ్‌ డాసన్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.