World Cup 2023 ENG vs BAN ODI : బంగ్లాదేశ్ పై ఇంగ్లాండ్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో ఏ స్థానంలో ఉందో తెలుసా..?
వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది

pic @England Cricket twitter
World Cup 2023 ENG vs BAN : వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లతో ఖాతాను తెరిచింది. ప్రస్తుతం పట్టికలో ఇంగ్లాండ్ ఐదో స్థానంలో నిలిచింది. 365 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 48.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 137 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో లిటన్ దాస్ (76; 66 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ముష్ఫికర్ రహీమ్ (51; 64 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. తౌహిద్ హృదయ్ (39) పరుగులతో రాణించగా తాంజిద్ హసన్ (1), నజ్ముల్ హుస్సేన్ శాంటో (0), షకీబ్ అల్ హసన్ (1), మెహిదీ హసన్ మిరాజ్ (8)లు ఘోరంగా విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రీస్ టోప్లీ నాలుగు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా, క్రిస్ వోక్స్ రెండు, సామ్ కరన్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
దంచికొట్టిన డేవిడ్ మలన్..
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. డేవిడ్ మలన్ (140; 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా జో రూట్ (82; 68 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్), జానీ బెయిర్ స్టో (52; 59 బంతుల్లో 8 ఫోర్లు)లు అర్థశతకాలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మహేదీ హసన్ నాలుగు వికెట్లతో రాణించగా, షారిఫుల్ ఇస్లాం మూడు, షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.
మలన్ విధ్వంసకర శతకం, జో రూట్, జానీ బెయిర్‌లు అర్థశతకాలతో రాణించడంతో 40 ఓవర్లకు 298/3 స్కోరుతో ఇంగ్లాండ్ నిలిచింది. క్రీజులో అప్పటికే నిలదొక్కుకున్న జో రూట్‌తో పాటు హ్యారీ బ్రూక్ ఉండడంతో ఇంగ్లాండ్ ఈజీగా 420 పరుగులు చేస్తుందని భావించారు. అయితే.. ఆఖరి 10 ఓవర్లలలో పుంజుకున్న బంగ్లా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ భారీగా పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. చివరి పది ఓవర్లలో ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి కేవలం 66 పరుగులు మాత్రమే చేసింది.
KL Rahul : కేఎల్ రాహుల్ కామెంట్స్.. అస్సలు ఊహించలేదు.. అయ్యర్ కనీసం రెండు ఓవర్లు అన్నా..
England step up in Dharamsala to garner their first #CWC23 win ⚡#ENGvBAN ?: https://t.co/5YbMGSEr8G pic.twitter.com/oL2N4fiViz
— ICC Cricket World Cup (@cricketworldcup) October 10, 2023