Euro Cup 2020 : యూరో కప్ విజేత ఇటలీ..

యూరోపియన్ ఛాంపియన్ షిప్ పుట్ బాల్ టోర్నీలో ఇటలీ క్రీడాకారులు అదరగొట్టారు. 1968 తర్వాత..ఇటలీ యూరప్ కప్ ను కైవసం చేసుకోవడంతో అక్కడి ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా...మెగా టోర్నీలో ఇటలీ విఫలమవుతూ వస్తోంది. దీనితో క్రీడాభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

Euro Cup 2020 : యూరో కప్ విజేత ఇటలీ..

Uefa Euro 2020

Updated On : July 12, 2021 / 9:10 AM IST

Euro Cup winner Italy : యూరోపియన్ ఛాంపియన్ షిప్ పుట్ బాల్ టోర్నీలో ఇటలీ క్రీడాకారులు అదరగొట్టారు. 1968 తర్వాత..ఇటలీ యూరప్ కప్ ను కైవసం చేసుకోవడంతో అక్కడి ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా…మెగా టోర్నీలో ఇటలీ విఫలమవుతూ వస్తోంది. దీనితో క్రీడాభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ప్రస్తుతం యూరో కప్ ను ముద్దాడంతో జట్టును ఆకాశానికి ఎత్తేస్తున్నారు. యూరో కప్ లో భాగంగా..ఇటలీ – ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇరు జట్లు హోరాహోరీ తలపడ్డాయి.

Read More : Telangana CM KCR : త్వరలో హస్తినకు సీఎం కేసీఆర్!

లండన్ లోని వెంబ్లే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చూడటానికి భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉత్కంఠగా సాగింది. గోల్ చేయడానికి ఇరుజట్ల క్రీడాకారులు పోటీ పడ్డారు. ఆట ప్రారంభమైన 2 నిమిషాలకే ఇంగ్లాండ్ ఆటగాడు లూక్ షా గోల్ చేశాడు. యూరో కప్ ఫైనల్ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో గోల్ చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఇంగ్లాండ్ అధిక్యంలో వచ్చింది. 67వ నిమిషంలో ఇటలీ ఆటగాడు లియానార్డో బోనుచి గోల్ చేసి స్కోరును సమం చేయడంతో ఇటలీ జట్టు అభిమానులు ఊరట చెందారు.

Read More : Delta Covid-19 Variant : డెల్టా వేరియంట్ భయంకరమైనది.. కరోనాపై వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయి!

నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమానంగా నిలిచారు. ఆటకు అదనపు సమయం కేటాయించారు. ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది. అందరిలోనూ ఉత్కంఠ. ఎవరు గోల్ కొడుతారు ? ఏ జట్టు అడ్డుకుంటుందనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఇటలీ ఆరు అవకాశాల్లో మూడింటిని గోల్స్ చేయగా..ఇంగ్లండ్ రెండు మాత్రమే గోల్ చేయగలిగింది. దీంతో 55 ఏళ్ల తర్వాత..తొలిసారి ఫైనల్ కు దూసుకొచ్చి కప్పు కైవసం చేసుకుందామని ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. పెనాల్టీ షూటౌట్ లో డోనరుమా ఆఖరి బంతిని అద్బుతంగా అడ్డుకోవడంతో యూరో కప్ విజేత ఇటలీ నిలిచింది.