Asian Games 2023 : అమ్మ ప్రేమ.. పిల్లలను తీసుకురావొద్దన్నందుకు.. ఆసియా గేమ్స్ నుంచి తప్పుకున్న క్రికెటర్
చైనాలోని హాంగ్జూ నగరం వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆసియా క్రీడలు(Asian Games 2023) ప్రారంభం కానున్నాయి. ఈ గేమ్స్‌లో క్రికెట్‌కు కూడా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

Bismah Maroof
Asian Games : చైనాలోని హాంగ్జూ నగరం వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆసియా క్రీడలు(Asian Games 2023) ప్రారంభం కానున్నాయి. ఈ గేమ్స్‌లో క్రికెట్‌కు కూడా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ సారి గేమ్స్‌కు పిల్లలను తీసుకురావొద్దని ఆసియా క్రీడల నిర్వాహకులు ప్లేయర్లకు సూచించారు. దీంతో పాకిస్తాన్ మహిళా జట్టు కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్(Bismah Maroof ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా గేమ్స్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు వెల్లడించింది.
ఆసియా గేమ్స్‌లో పాల్గొనే క్రికెటర్లు తమ పిల్లలను వెంట తీసుకురావొద్దనే నిబంధనను నిర్వాహకులు పెట్టారని, తన రెండేళ్ల చిన్నారిని వదిలి వెళ్లడం ఇష్టం లేకనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిస్మాహ్ మరూఫ్ చెప్పుకొచ్చింది. దీంతో పాకిస్తాన్ జట్టు బిస్మాహ్ సేవలను కోల్పోయింది. ఇక ఆసియా క్రీడల్లో పాకిస్తాన్‌కు మంచి రికార్డు ఉంది. వరుసగా రెండు సార్లు 2010లో చైనాలోని ఇంచెయాన్‌లో, 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో పాక్ స్వర్ణ పతకాలను గెలిచింది. వరుసగా మూడో సారి పసిడి గెలుచుకోవాలని భావిస్తున్న పాక్‌కు బిస్మాహ్ దూరం అవడం గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
Ajinkya Rahane : విండీస్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమైన రహానే.. పుజారా గతే పడుతుందా..?
2006లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది బిస్మాహ్ మరూఫ్. ఇప్పటి వరకు 124 వన్డేల్లో, 132 టీ20ల్లో పాక్‌కు ప్రాతినిథ్యం వహించింది. వన్డేల్లో 3,110 పరుగులు, టీ20ల్లో 2,658 పరుగులు చేసింది. ఇక బౌలింగ్‌లో వన్డేల్లో 44, టీ20ల్లో 36 వికెట్లు పడగొట్టింది. వన్డేల్లో ఒక్క శతకం చేయకుండా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కింది. 2021 ఏప్రిల్‌లో బిడ్డకు జన్మనిచ్చింది.
ఇదిలా ఉంటే.. పాక్‌కు చెందిన అయేషా నసీమ్(Ayesha Naseem) క్రికెట్‌కు గుడ్ బై చెప్పింది. 18 ఏళ్ల వయసులోనే ఆమె ఆట నుంచి తప్పకొని అందర్నీ షాక్‌కు గురి చేసింది. కాగా.. ఆసియా క్రీడల్లో పాల్గొనే పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టును పీసీబీ(Pakistan Cricket Board) ప్రకటించింది.
2023 ఆసియా క్రీడల కోసం పాకిస్థాన్ జట్టు :
నిదా దార్ (కెప్టెన్), అలియా రియాజ్, అనూషా నాసిర్, డయానా బేగ్, ఫాతిమా సనా, మునీబా అలీ, నజిహా అల్వీ, నష్రా సంధు, నటాలియా పర్వైజ్, ఒమైమా సోహైల్, సదాఫ్ షమాస్, హని, షావాల్ అమీన్‌ఫికర్,