Faf du Plessis : టీ20 క్రికెట్‌లో ఎలైట్ లిస్ట్‌లో చోటు సంపాదించిన డుప్లెసిస్‌..

ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన ఘ‌న‌త సాధించాడు

Faf du Plessis : టీ20 క్రికెట్‌లో ఎలైట్ లిస్ట్‌లో చోటు సంపాదించిన డుప్లెసిస్‌..

Faf du Plessis enters elite list in 200th match as T20 captain

Updated On : June 16, 2025 / 8:27 PM IST

ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20 క్రికెట్‌లో 200 మ్యాచ్‌ల‌కు పైగా కెప్టెన్సీ వ‌హించిన ఆట‌గాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. మేజ‌ర్ లీగ్ క్రికెట్‌లో భాగంగా ఓక్లాండ్‌లోని ఓక్లాండ్ కొలిసియంలో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌, టెక్సాస్ సూపర్ కింగ్స్ మ్యాచ్ ద్వారా అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ లీగ్‌లో డుప్లెసిస్ టెక్సాస్ సూప‌ర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

ఇక టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వ‌హించిన ఘ‌న‌త ఎంఎస్ ధోని పేరిట ఉంది. ధోని 331 టీ20 మ్యాచ్‌ల్లో సార‌థ్యం వ‌హించాడు. ఆ త‌రువాత రోహిత్ శ‌ర్మ‌, డారెన్ సామీలు ఉన్నారు.

Ravichandran Ashwin : ర‌విచంద్ర‌న్ అశ్విన్ పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు..

టీ20ల్లో అత్య‌ధిక మ్యాచ్‌ల‌కు సార‌థ్యం వ‌హించిన ఆట‌గాళ్లు వీరే..

ఎంఎస్ ధోని – 331 మ్యాచ్‌లు
రోహిత్ శ‌ర్మ – 225 మ్యాచ్‌లు
డారెన్ సామీ – 208 మ్యాచ్‌లు
జేమ్స్ విన్స్ – 208 మ్యాచ్‌లు
ఫాఫ్ డుప్లెసిస్ – 200 మ్యాచ్‌లు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 181 ప‌రుగులు చేసింది. డేవాన్ కాన్వే (34), డారిల్ మిచెల్ (36) లు రాణించారు. కెప్టెన్ ఫాప్ డుఫ్లెసిస్ (8) విఫ‌లం అయ్యాడు.

India U19 : ఇంగ్లాండ్‌తో సిరీస్‌.. టీమ్ఇండియాకు బిగ్ షాక్‌.. ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్ల‌కు గాయాలు..

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ 17.1 ఓవ‌ర్ల‌లో 124 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో సూప‌ర్ కింగ్స్ 57 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.