Gautam Gambhir : గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కోహ్లీని ఉద్దేశించి చేసిన‌వేనా..?

టీమ్ఇండియా రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు (2007టీ20, 2011 వ‌న్డే) గెల‌వ‌డంలో గౌత‌మ్ గంభీర్ కీల‌క పాత్ర పోషించాడు.

Gautam Gambhir : గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కోహ్లీని ఉద్దేశించి చేసిన‌వేనా..?

Gautam Gambhir-Virat Kohli

Updated On : October 29, 2023 / 4:42 PM IST

Gautam Gambhir-Virat Kohli : టీమ్ఇండియా రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు (2007టీ20, 2011 వ‌న్డే) గెల‌వ‌డంలో గౌత‌మ్ గంభీర్ కీల‌క పాత్ర పోషించాడు. అయితే ఎందుకో తెలియ‌దు కానీ.. గంభీర్ ఎక్కువ‌గా భార‌త ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజును విరాట్ కోహ్లీ ని టార్గెట్ చేస్తూ మాట్లాడ‌డాన్ని చూస్తూనే ఉన్నాం. తాజాగా గంభీర్ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇవి కోహ్లీని ఉద్దేశించి చేసిన‌వే అని కొంద‌రు అంటున్నారు.

వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక సెంచరీలు చేసిన రికార్డు క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంది. స‌చిన్ వ‌న్డేల్లో 49 శ‌త‌కాలు బాదాడు. అత‌డి రికార్డును బ్రేక్ చేసే దిశ‌గా విరాట్ కోహ్లీ దూసుకుపోతున్నాడు. విరాట్ ప్ర‌స్తుతం 48 సెంచ‌రీలు చేశాడు. ఈ క్ర‌మంలో కోహ్లీతో పాటు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు బ్రాడ్‌కాస్ట‌ర్‌గా ఉన్న‌ స్టార్ స్పోర్ట్స్ పై గంభీర్ ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించాడు. కోహ్లీ సెంచ‌రీల పై అధిక ప్ర‌చారం క‌ల్పిస్తుంద‌ని విమ‌ర్శించాడు.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగిన టీమ్ఇండియా ఆట‌గాళ్లు.. ఎందుకో తెలుసా..?

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఆరంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఇంటరాక్షన్ సందర్భంగా గంభీర్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. రోహిత్ శర్మను ప్ర‌శంసించాడు. కొంద‌రిలా రోహిత్ శ‌ర్మ రికార్డుల వెంట ప‌డ‌డం లేద‌న్నాడు. అత‌డు దేశం కోసం నిస్వార్థంగా ఆడుతున్నాడ‌ని కొనియాడాడు. గ‌ణాంకాల కోసం ఆడ‌క‌పోవ‌డంతోనే రోహిత్ గొప్ప నాయ‌కుడిగా నిలుస్తున్నాడ‌న్నారు.

అభిమానులు, ప్రసారకర్తలు(బ్రాడ్‌కాస్ట‌ర్‌లు) మాదిరిగా రోహిత్ శ‌ర్మ గ‌ణాంకాల‌ను ప‌ట్టించుకోడ‌ని గంభీర్ అన్నాడు. ఓ నాయ‌కుడిగా ఎలా ఆడాలో, జ‌ట్టు కోసం ఏం చేయాల‌న్న‌ది రోహిత్ కు బాగా తెలుస‌న్నాడు. ఈ విష‌యాన్ని త‌న బ్యాటింగ్ ద్వారానే తెలియ‌జేస్తున్నాడ‌ని, ఒకవేళ గ‌నుక రోహిత్ రికార్డుల కోస‌మే ఆడి ఉంటే ఈజీగా ఈ పాటికి 40 నుంచి 45 సెంచరీలు చేసే వాడ‌ని గంభీర్ చెప్పాడు. కానీ అత‌డు రికార్డుల కోసం ఆడ‌డం లేద‌ని, జ‌ట్టు కోసం నిస్వార్థంగా ఆడుతున్నాడ‌ని గంభీర్ పేర్కొన్నాడు.

Hindu Cricketers : విదేశాల నుంచి ఆడుతున్నా తమ హిందూ సంస్కృతిని మర్చిపోని క్రికెటర్లు

ప్లేయ‌ర్లు.. పీఆర్‌ల‌ను మార్కెటింగ్ ఎక్స్‌ప‌ర్ట్స్ ను పెట్టుకున్నంత మాత్ర‌న అది వాళ్ల‌కు స‌హ‌క‌రించ‌ద‌ని, జ‌ట్టు కోసం ఆడాల‌న్నాడు. రోహిత్‌ను తన జట్టును ముందు ఉండి నడిపిస్తున్నాడన్నాడు. గంభీర్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

కాగా.. టీమ్ఇండియా చివ‌రగా ఆడిన రెండు మ్యాచుల్లో విరాట్ సెంచ‌రీ కోసం సింగిల్స్ తీసేందుకు నిరాక‌రించ‌డాన్ని ప‌రోక్షంగా గంభీర్ ఎత్తి చూపాడ‌ని కొంద‌రు నెటీజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.