IND vs AUS : విశాఖ క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. చెబితే అస్సలు ఆగరు!
విశాఖపట్నంలోని క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు శుభవార్త చెప్పింది. విశాఖపట్నంలోని వైఎస్‌ఆర్ ఏసీఏ స్టేడియం అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
IND vs AUS : విశాఖపట్నంలోని క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. విశాఖపట్నంలోని వైఎస్‌ఆర్ ఏసీఏ స్టేడియం అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే నెల (నవంబర్) 23న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు విశాఖ వేదికైంది. కాగా.. ఈ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఆర్గనైజింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సమావేశానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ గోపీనాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున, సిటీ పోలీస్ కమిషనర్ ఎ.రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ తదితరులు హాజరు అయ్యారు. సమావేశం అనంతరం ఏసీఏ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి మాట్లాడారు. ఈ ఏడాది విశాఖలో జరిగే మూడో అంతర్జాతీయ మ్యాచ్ ఇది అన్నారు. గత మ్యాచుల్లో జరిగిన లోటు పాట్లపై చర్చించినట్లు తెలిపారు. ఈ సారి వాటిని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.
Also Read: నువ్వు ఇలా అంటావని అనుకోలేదు.. బాబర్ కెప్టెన్సీపై రగడ.. మాలిక్ పై మండిపడ్డ యూసఫ్
బీచ్ రోడ్డులో బిగ్ స్ర్కీన్స్ ఏర్పాటు
స్టేడియం కెపాసిటీ 27 వేలు అని, మ్యాచ్‌కు అన్ని రాష్ట్రాల ప్రెసిడెంట్ లను, సెక్రెటరీ లకు ఆహ్వానం అందిస్తామన్నారు. అంతేకాకుండా విశాఖలో బీచ్ రోడ్డులో 10 వేల మందికి పైగా వీక్షించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఐపీఎల్ తరహాలో ఫ్యాన్ పార్క్స్ ఏర్పాటు చేసి బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్లలోనూ విక్రయించనున్నట్లు చెప్పారు.
జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ.. అన్ని శాఖల సమన్వయంతో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌ను సజావుగా నిర్వహిస్తామని చెప్పారు. ఆటగాళ్ల కోసం గ్రీన్ ఛానెల్ ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
Also Read: నీకు ఎలా ఆడాలో మీ నాన్న నేర్పించలేదా..? మార్ష్‌ను ప్రశ్నించిన గవాస్కర్..
సీపీ రవి శంకర్ అయ్యర్ మాట్లాడుతూ.. మ్యాచ్ జరిగే రోజు పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఫ్యాన్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ భద్రత నడుమ మ్యాచ్ జరగనుందని చెప్పారు. దాదాపు 2 వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉండనున్నట్లు తెలిపారు.