Graeme Swann: స్టాండ్స్‌లో క్యాచ్ పట్టిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్.. బాల్ తీసుకొని ఎలా పరుగెత్తాడో చూడండి.. వీడియో వైరల్
ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తన ఆనందాన్ని అదుపుచేసుకోలేక పోయాడు. స్టాండ్స్‌లో బాల్‌ను క్యాచ్ పట్టి అటూఇటూ పరుగులు పెడుతూ తన ఆనందాన్ని వ్యక్తపర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తుంది.

Graeme Swann Happy
Graeme Swann: ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తన ఆనందాన్ని అదుపుచేసుకోలేక పోయాడు. స్టాండ్స్‌లో బాల్‌ను క్యాచ్ పట్టి అటూఇటూ పరుగులు పెడుతూ తన ఆనందాన్ని వ్యక్తపర్చాడు. గ్రేమ్ స్వాన్ విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీ10 యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో ఇటలీ వర్సెస్ స్విట్జర్లాండ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇటలీ, స్విట్జర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇటలీ ఆటగాడు బంతిని సిక్సర్ కొట్టాడు. స్టాండ్స్ లో ఉన్న ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ డ్రైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. ఇంకేముంది.. అతని ఆనందానికి అవధులులేకుండా పోయాయి. క్యాచ్ అందుకున్న బాల్‌తోనే అటూ ఇటూ పరుగులు పెడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వాన్ 2013లో తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తన కెరీర్‌లో ఇంగ్లండ్ తరఫున 60 టెస్టులు, 79 వన్డేలు, 39 టీ20లు మ్యాచ్‌లను 43ఏళ్ల గ్రేమ్ స్వాన్ ఆడాడు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
And @Swannyg66 grabs another one! Absolute scenes in Cartama? #EuropeanCricketChampionship #ECC22 #CricketinSpain pic.twitter.com/edTwcCrKPQ
— European Cricket (@EuropeanCricket) October 6, 2022
ఈ మ్యాచ్ లో ఇటీలీ స్విట్జర్లాండ్ ను ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ జట్టు.. నిర్ణీత 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన స్విట్జర్లాండ్ జట్లు ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో గ్రూప్ డిలో ఇటలీ, స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉన్నాయి.