Tractor Gift To Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రాక్టర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన బెలారస్ అధ్యక్షుడు.. ఎందుకంటే?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తన 70వ పుట్టినరోజు సందర్భంగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో నుండి విచిత్రమైన బహుమతిని అందుకున్నాడు.

Tractor Gift To Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రాక్టర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన బెలారస్ అధ్యక్షుడు.. ఎందుకంటే?

Russia President Putin

Updated On : October 8, 2022 / 8:41 AM IST

Tractor Gift To Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తన 70వ పుట్టినరోజు సందర్భంగా విచిత్రమైన బహుమతిని అందుకున్నాడు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని జారిస్ట్-యుగం కాన్‌స్టాంటిన్ ప్యాలెస్‌లో అనేక మాజీ సోవియట్ దేశాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సమయంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో పుతిన్‌కు తన తోటలో వినియోగించే అధునాతన ట్రాక్టర్‌ను బహుమతి ఇస్తున్నట్లు ధృవీకరణ పత్రాన్ని అందించారు. సోవియట్ కాలం నుండి ట్రాక్టర్లు బెలారసియన్ పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తున్నాయి.

Maharashtra: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..

పుతిన్‌కు ట్రాక్టర్‌ను బహుమతిగా ఇవ్వడంపై బెలారస్ అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడుతూ.. తన తోటలో ఉపయోగిస్తున్న మోడల్ ట్రాక్టర్‌నే పుతిన్‌కు కానుకగా ఇచ్చినట్లు తెలిపాడు. ప్రపంచంలోని అతిపెద్ద ధాన్యం ఎగుమతిదారులైన రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం ఎగుమతులకు అంతరాయం కలిగించింది. ఇది ప్రపంచ ఆహార సంక్షోభం భయాన్ని పెంచింది. ఇలాఉంటే బెలారస్ ప్రెసిడెంట్ ఇచ్చిన బహుమతిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎలా స్పందించారనే విషయంపై స్పష్టత లేదని లుకాషెంకో కార్యాలయం పేర్కొంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మాజీ సోవియట్ దేశాల మధ్య వివాదాలను పరిష్కరించే మార్గాలను ఈ సమావేశంలో చర్చించారు. ఉగ్రవాదం, అక్రమ మాదక ద్రవ్యాలు, ఇతర నేరాలపై పోరాడేందుకు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ సమావేశం అనంతరం పుతిన్ మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో బెలారస్ అధ్యక్షుడు ఇచ్చిన బహుమతి గురించి పుతిన్ ప్రస్తావించలేదు.