IPL 2023, GT vs MI: చేతులెత్తేసిన బ్యాటర్లు.. ముంబై పై గుజరాత్ ఘన విజయం
IPL 2023, GT vs MI: ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగాముంబై ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) 55 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

Gujarat Titans win
IPL 2023, GT vs MI: ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగాముంబై ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) 55 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో నేహాల్ వధేరా(40; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కామెరూన్ గ్రీన్(33; 26 బంతుల్లో 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(23; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనిపించగా మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు, హార్దిక్ పాండ్య ఓ వికెట్ పడగొట్టాడు.
IPL 2023, GT vs MI: ముంబై పై గుజరాత్ ఘన విజయం
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(56; 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకోగా డేవిడ్ మిల్లర్(46; 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), అభినవ్ మనోహర్ (42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఆఖర్లో తెవాటియా (20 నాటౌట్; 5 బంతుల్లో 3 సిక్సర్లు) దంచికొట్టడంతో ముంబై ముందు భారీ లక్ష్యం నిలిచింది. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా, అర్జున్ టెండూల్కర్, రిలే మెరెడిత్, జాసన్ బెహ్రెండోర్ఫ్, కుమార్ కార్తికేయలు ఒక్కొ వికెట్ పడగొట్టాడు.
IPL 2023: గెలుపు మత్తులో ఉన్న వార్నర్‌కు భారీ షాక్