Mohammad Azharuddin: హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు అజహరుద్దీన్ పై కేసు నమోదు.. ఎందుకంటే?

గతంలో ఏకకాలంలో హెచ్ సీఏ, డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా అజహరుద్దీన్‌ వ్యవహరించారు. హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఉండి నిబంధనలు ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.

Mohammad Azharuddin: హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు అజహరుద్దీన్ పై కేసు నమోదు.. ఎందుకంటే?

Mohammad Azharuddin

Updated On : October 19, 2023 / 12:22 PM IST

HCA Former Presidents Azharuddin : హెచ్ సీఏ మాజీ అధ్యక్షులు అహ్మద్ అజహరుద్దీన్ పై కేసు నమోదైంది. HCA (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) లో అవకతవకలు జరిగాయని ఉప్పల్ పోలీసులకు సుప్రీంకోర్టు నియమించిన లావు నాగేశ్వరరావు కమిటీ ఫిర్యాదు చేసింది. నిధులు గోల్ మాల్, సామాగ్రి కొనుగోలులో అవకతవకలు జరిగాయని పేర్కొంది. జిమ్ ఎక్విప్మెంట్ , ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, క్రికెట్ బాల్స్, బకెట్ ఛైర్స్ కొనుగోలులో భారీగా అవకతవకలు ఉన్నాయంటూ ఫిర్యాదులో కమిటీ పేర్కొంది. పరికరాల కొనుగోలు కమిటీలో ఉన్న అజారుద్దీన్, జాన్ మనోజ్, విజయానంద్ మీద కేసు నమోదైంది. నలుగురు హెచ్ సీఏ మాజీల మీదకూడా ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

HCA Elections 2023 : హెచ్‌సీఏ ఎన్నిక‌ల బ‌రిలో అనిల్ కుమార్ ప్యానెల్‌.. హెచ్‌సీఏను ప్ర‌క్షాళ‌న చేస్తాం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నెలకొన్న వివాదం సుప్రీంకోర్టు కు చేరింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో వన్ మ్యాన్ కమిటీ నియమిస్తూ ఈఏడాది ఫిబ్రవరి నెలలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్ సీఏ ప్రక్షాళనకు లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిటీ చర్యలు చేపట్టింది. ఆగస్టు నెలలో బహుళ క్లబ్ లతో హెచ్ సీఏను శాసిస్తున్న క్రికెట్ పెద్దలకు షాకిచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న 57 క్లబ్ లపై జస్టిస్ నాగేశ్వరరావు అనర్హత వేటు వేశారు. దీనికితోడు అక్టోబర్ నెలలో హెచ్ సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా మహ్మద్ అజహరుద్దీన్ పై కమిటీ అనర్హత వేటు వేసింది.

HCA Polls: రసవత్తరంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు.. గెలిచేదెవరో?

గతంలో ఏకకాలంలో హెచ్ సీఏ, డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా అజహరుద్దీన్‌ వ్యవహరించారు. హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఉండి నిబంధనలు ఉల్లంఘించినందుకు అనర్హత వేటు వేస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఈ మేరకు హెచ్ సీఏ ఓటరు జాబితా నుంచి అజహరుద్దీన్ పేరునుసైతం తొలగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. తాజాగా అజహరుద్దీన్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో సుప్రీంకోర్టు నియమించిన లావు నాగేశ్వరరావు కమిటీ ఫిర్యాదు చేసింది. నిధుల గోల్ మాల్, సామాగ్రి కొనుగోలులో అవకతవకలకు పాల్పడినట్లు ఆడిట్ రిపోర్ట్ లో తేలడంతో అజహారుద్దీన్ పై కమిటీ ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.