హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు

హెచ్‌సీఏలో జరుగుతున్న అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరింది.

హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు చేసింది. హెచ్‌సీఏలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించి ఆ అసోసియేషన్‌ను రద్దు చేయాలని టీసీఏ డిమాండ్ చేసింది.

బీసీసీఐ నిధులను హెచ్‌సీఏ దుర్వినియోగం చేసిందని తెలిపింది. అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన అవినీతి ఇప్పుడు జగన్ మోహన్ హయాంలోనూ కొనసాగుతోందని హెచ్‌సీఏ ఆరోపించింది. సుప్రీంకోర్టు తీర్పును కూడా హెచ్‌సీఏ పట్టించుకోవడం లేదని చెప్పింది.

హెచ్‌సీఏ పరిధిలోని క్లబ్బులు అవినీతిమయంగా మారాయని తెలిపింది. హెచ్‌సీఏలో జరుగుతున్న అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరింది. గ్రామీణ క్రికెట్‌ను హెచ్‌సీఏ పట్టించుకోలేదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. హెచ్‌సీఏలో అవినీతి మీద తెలంగాణ సీఎస్, ఏసీబీ, సీబీఐకి ఫిర్యాదు చేశామని చెప్పింది. జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ను ప్రోత్సహించాల్సిన అవసరముందని టీసీఏ తెలిపింది.

Also Read: పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం.. చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా